దర్శకుడిగా కెరీర్ ప్రారంభమే ఆది వంటి బ్లాక్ బస్టర్ హిట్ తో ప్రారంభించి తొలి చిత్రం నుంచే మాస్ డైరెక్టర్ ఇమేజ్ సొంతం చేసుకున్న దర్శకుడు వి.వి.వినాయక్. అలా ఆయన కెరీర్ తొలినాళ్లలో తెరకెక్కించిన చిత్రాలు ఆది, దిల్, సాంబ, బన్నీ, లక్ష్మి వంటి చిత్రాలు అన్ని మాస్ ఎలెమెంట్స్ తో ప్రేక్షఖాదరణ పొంది బాక్స్ ఆఫీస్ వద్ద ఎబోవ్ అవేరేజ్ నుంచి హిట్ చిత్రాలు గా నిలిచాయి. కాగా రాను రాను మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి తగ్గ విధంగా మాస్ ఎలెమెంట్స్ ని కొత్త తరహాలో అందించే కథలని ఎంపిక చేసుకోవటంలో విఫలమైన వినాయక్ కెరీర్ గ్రాఫ్ అమాంతం దిగువ స్థాయికి నెట్టుకున్నారు.
వినాయక్ ఎదురు చూస్తున్న సక్సెస్ ని మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఖైదీ నెం.150 వంటి రీమేక్ తో అందుకున్నారు. అది అప్పటికే తమిళంలో కత్తి గా విడుదలై భారీ విజయం అందుకున్న కథ కాబట్టి స్టోరీ సెలక్షన్ విషయంలో వినాయక్ సక్సెస్ అయ్యారని చెప్పలేని పరిస్థితి. ఈ సారి ఆయన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో తెరకెక్కిస్తున్న ఇంటెలిజెంట్ చిత్రం మాత్రం వినాయక్ స్వయంగా కథ ఎంపిక చేసుకుని దాన్ని తేజు కి అనుగుణంగా మార్చి తెరకెక్కిస్తున్న చిత్రం కావటంతో వినాయక్ నిజమైన బౌన్స్ బ్యాక్ తో పాటు వరుస వైఫల్యాలతో వున్న హీరోకి హిట్ ఇవ్వగలిగే ఇంటలిజెన్స్ దర్శకుడికి ఉందా లేదా అనేది రుజువు చేసే చిత్రం కాబోతుంది.