డిసెంబ‌ర్ టు స‌మ్మ‌ర్‌....' మెగా ' సంద‌డి

Update: 2017-11-20 07:00 GMT

టాలీవుడ్‌లో ఇప్పుడు మెగాహీరోలు ఓ క్రికెట్ టీం మాదిర‌గా మారిపోయారు. యేడాది చొప్పునా ప్ర‌తి నెలా మోగా హీరోల సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటున్నాయి. తాజాగా డిసెంబ‌ర్ నుంచి వ‌చ్చే స‌మ్మ‌ర్ వ‌ర‌కు ప్ర‌తి నెలా మెగా హీరో సినిమా ఏదో ఒక‌టి రిలీజ్ కానుంది. డిసెంబ‌ర్ 1న మెగా మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించిన జ‌వాన్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. బీవీఎస్‌.ర‌వి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో సాయి స‌ర‌స‌న మెహ్రీన్ హీరోయిన్‌గా న‌టించింది. ఇక డిసెంబ‌ర్ 23న అల్లు శిరీష్ హీరోగా టైగ‌ర్‌, ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా ద‌ర్శ‌కుడు విఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఒక్క క్ష‌ణం వస్తోంది. ఈ సినిమాలో సుర‌భి, సీర‌త్‌క‌పూర్ హీరోయిన్లు.

జనవరిలో పవన్....

ఇక జ‌న‌వ‌రిలో ప‌వ‌న్ - త్రివిక్ర‌మ ప్రెస్టేజియ‌స్ మూవీ అజ్ఞాత‌వాసి (వ‌ర్కింగ్ టైటిల్‌) సంక్రాంతి కానుక‌గా 10న రిలీజ్ అవుతోంది. నూతన దర్శకుడు వెంకి అట్లూరి తో వరుణ్ తేజ్ చేసిన సినిమా ఫిబ్రవరిలో విడుదల కానుంది. వ‌రుణ్ తేజ్ ఫిదాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టాక చేస్తోన్న సినిమా కావ‌డంతో ఈ సినిమాపై మంచి అంచ‌నాలు ఉన్నాయి.

మార్చిలో...రంగస్థలం....

ఇక మార్చిలో మెగాప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ తేజ్ - క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో వ‌స్తోన్న రంగ‌స్థ‌లం వ‌స్తోంది. మార్చి 29న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. స‌మంత ఈ సినిమాలో హీరోయిన్‌. ఇక ఏప్రిల్ బ‌న్నీ వంతు. బ‌న్నీ హీరోగా స్టార్ రైట‌ర్ వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న నాపేరు సూర్య ఏప్రిల్ 27న విడుదల కానుంది. ఇలా డిసెంబ‌ర్ నుంచి స‌మ్మ‌ర్ వ‌ర‌కు ప్ర‌తి నెలా మెగా ఫ్యామిలీ హీరో సినిమా థియేట‌ర్ల‌లోకి దిగ‌డంతో వ‌చ్చే స‌మ్మ‌ర్ వ‌ర‌కు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మెగా హీరోల సంద‌డే ఉండ‌నుంది.

Similar News