డైరెక్ట్ ఫిలింతో తమిళులను ఎంటర్టైన్ చెయ్యడానికి మహేష్ బాబు రెడీ అవుతున్నాడు. మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న 'స్పైడర్' చిత్రం బైలింగ్యువల్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్ తో జోడి కడుతున్న ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. అయితే ఈ చిత్రం తెలుగు తమిళంలో తెరకెక్కుతున్నప్పటికీ హిందీలో కూడా డబ్ చెయ్యాలని మురుగదాస్ భావిస్తున్నాడు. రెండు సాంగ్స్ మినహా ఇప్పటికే టాకీ పార్ట్ కంప్లీట్ చేసుకున్న 'స్పైడర్' ప్రస్తుతం ఆ రెండు సాంగ్స్ ని కూడా తెరకెక్కిస్తున్నారు.
అలాగే 'స్పైడర్' చిత్ర డబ్బింగ్ పనులు కూడా జోరందుకున్నాయని అంటున్నారు. అయితే స్పైడర్ తమిళ్ వెర్షన్ కి మహేష్ బాబు స్వయంగా డబ్బింగ్ కూడా చెబుతున్నాడట. ఇప్పటికే తన చిత్రాలను ( అర్జున్, అతడు, బిజినెస్‌మేన్) తమిళ్ లో డబ్ చేసినప్పటికీ వాటికి మహేష్ బాబే తమిళ డబ్బింగ్ చెప్పడం గమనార్హం. ఇక ఇపుడు డైరెక్ట్ తమిళ్ ఫిలిం 'స్పైడర్' కి కూడా తానె స్వయంగా తమిళ్ డబ్బింగ్ చెబుతున్నాడన్నమాట.
అసలు మహేష్ కి తమిళం బాగా వచ్చు. మహేష్ ఇప్పుడు ప్రస్తతానికి హైదరాబాద్ లో ఉంటున్నప్పటికీ పెగిందంతా చెన్నైలోనే కావడంతో తమిళం మీద గట్టి పట్టే వుంది. సో అందుకే మహేష్ ఈజీగా తమిళం మాట్లేడేస్తూ తన డబ్బింగ్ తానె చెప్పేసుకుంటున్నాడన్నమాట.