ట్వీట్స్ తో ఆటపట్టిస్తున్నారుగా!

Update: 2017-11-22 11:00 GMT

నిన్న మంగళవారం తమిళనటుడు ఆర్య సరదాగా తన ట్విట్టర్ లో హలో ఫ్రెండ్స్ నేను నా జీవిత భాగస్వామిని వెతుకుతున్నానని... అమ్మాయి విషయంలో ఎలాంటి డిమాండ్స్ కానీ.. కండిషన్స్ గాని లేవని... నేను మీకు గనక నచ్చితే. గనక నా నెంబర్ కి ఫోన్ చెయ్యండి అంటూ తన ఫోన్ నెంబర్ 73301-73301 కూడా ఇచ్చేసాడు. మరి ఆర్య అలా వీడియో ట్విట్టర్ లో పోస్ట్ చేసాడో లేదో... ఇలా అతని కో స్టార్స్ అందరూ ఆర్యని ఆట పట్టించే పనిలో పడ్డారు. అటు కోలీవుడ్ స్టార్స్ ఇటు టాలీవుడ్ లో ఆర్యా సన్నిహితులు కూడా ఆర్య చేసిన పోస్ట్ కి రీట్వీట్స్ చేస్తూ ఆటపట్టించేస్తున్నారు.

అందులో తమన్, త్రిష, జయం రవి, రాధికా శరత్ కుమార్, రానా, అల్లు శిరీష్ ఇంకా కొందరు ఆర్యని ట్వీట్స్ తో ఆడుకుంటున్నారు.

త్రిష: వావ్... నువ్వు అనుకుంటున్న ఈ కొత్త ప్రాజెక్ట్‌లో అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా. కానీ నేను మాత్రం నవ్వు ఆపుకోలేకపోతున్నా అంటూ ఆర్య ట్వీట్ కి రీట్వీట్ చేసి ఆర్యా ని ఏడిపించింది.

ఖుష్బూ: ఆర్యా నువ్వైతేనే ఇలాంటి ఫన్నీ కామెంట్స్ చెయ్యగలవ్ అంటూ ట్వీట్ చేసింది.

రాధికా శరత్ కుమార్: నువ్వు చెప్పింది చాలా ఫన్నీగా వుంది.. నేనైతే నిజంగా చెబుతున్న నిన్ను మాత్రం ఎవరో ఒకరు తన్నుతారంటూ కామెంట్ చేసింది.

అల్లు శిరీష్: నా స్నేహితుడు ఆర్య జీవిత భాగస్వామి కోసం వెతుక్కుంటున్నాడు. ఎవరికైనా ఆసక్తి ఉంటె ట్రై చేసుకోండి.. అలాగే ఆర్య బ్రదర్.... నీకు అమ్మాయి సెట్ కాగానే ఆ నెంబర్ కి కాల్ చేసే అమ్మాయిల నంబర్స్ నాకు ఫార్వర్డ్ చెయ్ అంటూ సరదా ట్వీట్ చేసాడు.

రానా: టాలీవుడ్ ఆజానుబాహుడు ఆరడుగుల అందగాడు... రానా అయితే అల్ ద బెస్ట్ మచ్చా అంటూ ట్వీట్ చేసాడు.

మరి ఆర్య పెళ్లి చేసుకుంటాను అనగానే ఇంతమంది ఇన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్నారు అంటే.. త్వరలోనే ఆర్య పెళ్లి జరిగిపోతుంది.

Similar News