టోటల్ కన్ఫ్యూషన్

Update: 2017-10-04 09:00 GMT

చిరు 151 సినిమా సైరా నరసింహారెడ్డి గా ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా చిరు లీడ్ రోల్ లో చేస్తున్న సినిమా సైరా నరసింహా రెడ్డి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లపై పై సొంతంగా నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమా పై అనేక రకాల రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి. ఈ సినిమా యొక్క మ్యూజిక్ డైరెక్టర్ విషయం లో చిత్ర బృందం ఇంకా కన్ఫ్యూజన్ లో ఉంది. ముందు నుండి సైరా సినిమా కి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎ.ఆర్. రెహమాన్ ఉంటారని అందరూ అనుకుంటున్నారు.

దానికి అనుగుణంగానే చిత్ర బృందం కూడా అధికారికంగా రెహమాన్ ఈ సినిమా కి సంగీత అందిస్తున్నట్లు అధికారికంగా చెప్పుకొచ్చారు. అయితే ఆ మధ్య సై రా మ్యూజిక్ కంపోజర్ గా రెహమాన్ తప్పుకున్నట్లు.... అతని ప్లేస్ లో వేరొక వ్యక్తి ని రామచరణ్ తీసుకున్నట్లు టాక్ వినిపించింది. అంతలోనే మళ్ళీ రెహమాన్ సంగీత దర్శకుడుగా కొనసాగుతున్నాడని సమాచారం కూడా వచ్చింది. అయితే తాజాగా వినిపిస్తున్న మాటల ప్రకారం ఇంకా చిత్ర బృందం మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో పూర్తి క్లారిటీ గా లేరని తెలుస్తుంది.

అయితే ఒకవేళ సైరా నుంచి ఏ ఆర్ రహమాన్ నిజంగానే తప్పుకుంటే ఆ స్థానాన్ని ఎస్ ఎస్ తమన్ భర్తీ చేస్తాడు అని ఎప్పటినుండో ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతున్న వార్త. మరి చివరికి చిరంజీవి సై రా కోసం ఎలాంటి సంగీత దిగ్గజం దిగనుందో అనేది ప్రస్తుతానికి అయితే సస్పెన్స్. ఇకపోతే ఈ సినిమా కోసం హీరోయిన్ నయనతార రెడీ గా వుంది. అలాగే అమితాబ్, విజయ్ సేతుపతి, జగపతి బాబు వంటి హేమాహేమీలు ఈ చిత్రంలో నటిస్తున్నవిషయం తెలిసిందే.

Similar News