టైటిల్ కూడా ఎన్టీఆరేనా?

Update: 2018-03-05 10:31 GMT

హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ నేటినుంచి ప్రారంభమయ్యే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో పాల్గొనడానికి అమరావతికి వచ్చారు. ఈ సందర్బంగా మీడియాతో మలాడిన బాలకృష్ణ తన తండ్రి. నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ఎన్టీఆర్‌ బయో పిక్ ను ఈనెల 29న ప్రారంభిస్తున్నామని మీడియా ముఖంగా ప్రకటించారు. అదికూడా హైదరాబాద్‌ లోని రామకృష్ణ సినీ స్టూడియోలో తొలి షెడ్యూల్‌ షూటింగ్‌ ప్రారంభిస్తామన్నారు. అయితే ఎన్టీఆర్‌ మీద ఉన్న అభిమానంతో ఈ సినిమాకి చాలామంది చాలా టైటిల్స్ సూచించారని, కానీ ఎన్టీఆర్‌ను మించిన టైటిల్ మరొకటి లేదని భావించామని.... అందుకే ఎన్టీఆర్ బయో పిక్ కి 'ఎన్టీఆర్‌' అనే టైటిల్ నే ఫైనల్ చేశామని ఆయన చెప్పారు.

పార్టీలకు అతీతంగా ఎన్టీఆర్‌కు అభిమానులున్నారని, ఎన్టీఆర్‌ బయో పిక్ చేస్తున్నామని ప్రకటించగానే నన్ను ప్రతి ఒక్కరు అభినందించారని ఆయన అన్నారు. అయితే ఈ సినిమాకి డైరెక్టర్ విషయంలో మాత్రం బాలకృష్ణ క్లారిటీ ఇవ్వలేదు. ఇకపోతే తండ్రి పాత్రలో బాలకృష్ణ తనే నటించనుండగా.. తను కూడా ఓ నిర్మాతగా వ్యవహరించబోతున్న ఈ మూవీకి సంబంధించిన అన్ని పనులు అంటే స్క్రిప్ట్ వర్క్ పనులు అన్ని గతంలోనే పూర్తయిపోయాయి. ఇకపోతే బాలకృష్ణ ఈ మధ్యన భుజానికి అయిన గాయంతో.. శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే.

అయితే బాలకృష్ణ ఇప్పుడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో పాల్గొనడానికి అమరావతి కి కూడా చేతికి కట్టుతోనే వచ్చాడు. మరి బాలకృష్ణ 66 పాత్రల్లో కనబడబోయే ఎన్టీఆర్ బయో పిక్ కి సంబందించిన పూర్తి వివరాలు అతి త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం.

Similar News