టీజర్ లాంచ్ చేయనున్న మెగా స్టార్

Update: 2018-01-30 04:49 GMT

దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం అంటేనే అది భారీతనానికి చిరునామా అవుతుంది. హీరోల ఇమేజ్, మార్కెట్ స్ట్రాటజీ లతో సంబంధం లేకుండా భారీ వ్యయాలతో చిత్రాలని తెరకెక్కించే శంకర్ తన చిత్రాలపై ప్రేక్షకులలో నిరంతరం ఏదో ఒక చర్చ జరిగే విధంగా బజ్ ఏర్పరుస్తుంటారు. అయితే ఈ సారి సూపర్ స్టార్ రజని కాంత్ హీరో కావటం 2.0 చిత్రానికి ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు ఏమి అవసరం ఉండకపోవచ్చు. అయినప్పటికీ దుబాయ్ లో అట్టహాసంగా గీతావిష్కరణ చేసిన చిత్ర బృందం చిత్రాన్ని చెప్పిన ప్రణాళిక ప్రకారం విడుదల చేయలేకపోయింది.

విజువల్ ఎఫెక్ట్స్ పనులు ఇంకా పూర్తి కాకపోవటంతో విడుదల వాయిదా వేసుకున్న చిత్ర బృందం కనీసం టీజర్ కూడా విడుదల చేయకపోవటంతో సామాన్య ప్రేక్షకులలో ఈ చిత్రం పై బజ్ మెల్ల మెల్లగా సన్నగిల్లుతూ వస్తోంది. ఇప్పటికి ఇంకా ఈ చిత్రం ఏప్రిల్ విడుదలపై సందేహాలు వీడనప్పటికీ వచ్చే నెల మూడవ వారంలో హైదరాబాద్ నగరంలో మెగా స్టార్ చిరంజీవి చేతుల మీదుగా టీజర్ లాంచ్ చేసి మరి కొంత కాలం ప్రేక్షకులని ఎంగేజ్ చేసే యోచనలో వున్నారు నిర్మాతలు. ప్రస్తుతం లాస్ ఏంజెల్స్ లో విజువల్ ఎఫెక్ట్స్ పనులు శర వేగంగా జరుగుతున్నట్టు సమాచారం.

Similar News