కబాలి' ఫేం ధన్సిక.. తమిళ హీరో శింబు తండ్రి టి రాజేందర్ గురించి ఇన్నాళ్లకు నోరు విప్పింది. సినిమా ప్రమోషన్ కోసం మీడియా సమావేశంలో తనను తీవ్రంగా అవమానించిన రాజేందర్ గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. టి రాజేందర్ అంటే నాకు చాలా గౌరవం.. ఆయన ఆ రోజు ఆలా స్టేజి మీద తిట్టడం వల్ల నేను చాలా బాధపడ్డానని.. వారంరోజులపాటు ఆ వేదన అనుభవించానని తెలిపింది.
ఆ లక్షణాలేవీ లేవు...
అతనో ఆధ్యాత్మిక వ్యక్తని అందరూ అంటుంటారు.. కానీ అతనిలో ఆ లక్షణాలు మచ్చుకైనా కనిపించలేదు..ఆధ్యాత్మిక భావాలు ఉంటే ఆ వ్యక్తి అలా నాపై అరవడని చెప్పింది. నాలో ఆధ్యాత్మిక భావాలు కలిగున్నాయి కాబట్టి నేను అతనిలా రెచ్చిపోలేదంది. స్టేజి మీద అయన పేరు మర్చిపోవటం తప్పే దానికి ఆయన ఆలా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అంటూ వాపోయింది. మూవీ ప్రమోషన్ లో భాగంగా జరిగిన మీడియా సమావేశంలో టి రాజేందర్ హీరోయిన్ ధన్సికను అందరి ముందు అవమానించి మాట్లాడిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనపై అప్పట్లో హీరో విశాల్ ఇలా స్పందించాడు..చిత్ర పరిశ్రమలో ఎంతో అనుభవం ఉన్న రాజేందర్ తన కుమార్తె వయసు ఉన్న నటిని క్షమించలేకపోయారని విశాల్ కామెంట్ చేశారు. ఆ రోజు ధన్సికకు జరిగిన అవమానాన్ని తమిళ పరిశ్రమకు చెందిన చాలా మంది ప్రముఖులు టి రాజేందర్ పై మండిపడ్డారు