టాలీవుడ్ హీరోయిన్ పై చీటింగ్ కేసు?

Update: 2018-03-12 06:00 GMT

చందమామ సినిమాలో కాజల్ తో పాటే ఒక హీరోయిన్ ఆడిపాడింది. ఆమె తన అల్లరితో ఆ సినిమాలో కాజల్ అగర్వాల్ తో పోటీ పడి మరి నటించింది. ఆ అమ్మాయి ఎవరో ఈపాటికే మీరు గుర్తు పట్టేసి ఉంటారు. ఆమె ఎవరో కాదు చందమామ సినిమా తర్వాత పెద్దగా అవకాశాలు లేక చివరకి సినిమాలల్లో కనబడడమే మానేసిన సింధు మీనన్. మరి చందమామ తర్వాత మళ్ళీ అంత ఫెమ్ లేని సింధు మీనన్ ఇప్పుడు ప్రస్తుతం వార్తల్లో హాట్ టాపిక్ అయ్యింది. అదేమిటంటే సింధు మీనన్ మీద చీటింగ్ కేసు నమోదు అవడంతో ఒక్కసారిగా ఆమె పేరు మీడియాలో హల్చల్ చేసింది.

ఇంతకీ సింధు మీనన్ మీద ఆ చీటింగ్ కేసు కథా కమామిషు ఏమిటంటే... బెంగళూరులోని ఆర్ఎంసీ యార్డ్ పోలీస్ స్టేషన్ లో సింధు మీనన్ తో పాటు ఆమె ముగ్గురు సోదరులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు ఆ కేసు పూర్వాపరాల్లోకి వెళితే జుబిలెంట్ మోటార్స్ వక్ఫ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఆర్ఎంసీ యార్డ్ లోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ నుంచి సింధు మీనన్ 36 లక్షల రుణం తీసుకోగా... . ఆ తర్వాత ఆమె తీసుకున్న రుణానికి వడ్డీ కానీ.. అసలు ఆ రుణం కానీ ఆమె చెల్లించకుండా తాత్సారం చెయ్యడమే కాదు.... అసలు రుణం కోసం సింధు మీనన్ సమర్పించిన పత్రాలను కూడా నకిలీవిగా బ్యాంకు వారు గుర్తించిన నేపథ్యంలో..... బ్యాంకు అధికారులు ఆమెపై పోలీసులను ఆశ్రయించారు.

అయితే వెంటనే పోలీస్ లు సింధు మీనన్ పై కేసు నమోదు చెయ్యడమే కాదు ఆమెను అరెస్ట్ కూడా చెయ్యడానికి రంగం సిద్ధం చేసి ఆమెను అదుపులోకి తీసుకుందామనుకున్న సమయానికి సింధు మీనన్ విదేశాల్లో ఉండడంతో ఆమె అరెస్ట్ ప్రస్తుతానికి ఆగింది. ఆమె అరెస్ట్ జరగకపోయినా.. సింధు సోదరుడు కార్తికేయన్ ను మాత్రం పోలీస్ లు అరెస్ట్ చేయగలిగారు.

Similar News