టాలీవుడ్ నిర్మాతకు చుక్కలు చూపించిన జీఎస్టీ అధికారులు

Update: 2018-02-22 07:32 GMT

ప్రభుత్వానికి జీఎస్టీ కట్టకుండా ఎగవేశాడనే ఆరోపణతో తెలుగు నిర్మాతపై కేసు పెట్టారు . ఇటీవల ఈ నిర్మాత సినిమా నిర్మాణంలో నటీనటులకు సాంకేతిక నిపుణులకు పారితోషికాలు చెల్లించేటప్పుడు 12 శతం జీఎస్టీ మినహాయించుకున్నాడని , ఆ మొత్తం ప్రభుత్వానికి చెల్లంచలేదని అధికారులు గుర్తించి ఆయన కార్యాలయంపై... బుధవారం సాయంత్రం కేంద్ర జీఎస్టీ అధికారులు దాడులు చేసి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు . అయితే ఈ నిర్మాత ఏడూ కోట్ల వరకు జీఎస్టీ చెల్లించాల్చి ఉందని తేల్చారు. అయితే ఆ మొత్తం కట్టకుండా ఆ నిర్మాత ఎగవేశాడని తెలుస్తుంది.

అయితే సదరు నిర్మాత వెంటనే రెండు కోట్లు జీఎస్టీ ని చెల్లించాడని.... అలాగే ఒక వారం రోజులు గడువు అడిగాడని మిగిలిన ఐదు కోట్లు చెల్లిస్తానని మాట ఇచ్చాడని అధికారులు చెబుతున్నమాట. మరి ఆ నిర్మాత ఆ డబ్బుని సకాలంలో చెలించకపోతే అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తామని అధికారులు చెబుతున్నారు. మాములుగా అయితే జీఎస్టీ ఎగవేతకు పాల్పడితే ఐదు సంవత్సరాలవరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని వారు తెలిపారు . కోట్లు పెట్టి సినిమా తీస్తూ జీఎస్టీ ఎగవేతకు పాల్పడే వారిపై ఒక కన్ను వేశామని అధికారులు చెప్పారు .అయితే ఇంత జరిగినా ఈ నిర్మాత ఎవరు అనేది మాత్రం బయటికి రానివ్వడం లేదు. కానీ దక్షిణ భారత దేశంలో ఈ తరహాలో నమోదైన మొదటి కేసు ఇదేనని అధికారులు చెబుతున్నారు

Similar News