టాప్ హీరోయిన్ కండీషన్స్ అప్లై!!

Update: 2017-07-23 12:40 GMT

సమంత ఏదైనా చెప్పాలంటే మొహమాటం లేకుండా ఏదైనా ఫ్రాంక్‌గా మాట్లాడేస్తుంది. అయితే సమంత ఇప్పుడు పెళ్లి విషయంలో కాస్త బిజీగా ఉన్నాకూడా తాను నటించే సినిమాల మీద బాగా ఫోకస్ పెట్టింది. తెలుగులో, తమిళంలో ఎడా పెడా సినిమాలు చేస్తున్న సమంత పెళ్లి కోసం ఈ సినిమాల షూటింగ్ కి స్పీడు పెంచింది. స్పీడు ఎలాగున్నా పెళ్లి అయిన వెంటనే కూడా షూటింగ్స్ కి వెళ్లిపోతానని మొహమాట పడకుండా చెప్పేస్తుంది. అలాగే మొన్నటికి మొన్న తనకి ఫుడ్ లేకపోయినా పర్వాలేదు సెక్స్ లేకుండా మాత్రం ఉండలేనని కుండబద్దలు కొట్టి సంచలనం అయ్యింది.

ఇక ఇప్పుడుతాజాగా తాను నటించబోయే తమిళ మూవీ కోసం సమంత కొన్ని కండీషన్స్ పెడుతుందట. లేటెస్ట్‌గా తమిళ్‌లో శివకార్తికేయన్‌తో కలిసి నటిస్తున్న సమంత మూవీ యూనిట్‌కి ఓ కండిషన్ పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఆ కండిషన్ మరేదో కాదు తనకి స్కిన్ ఎలర్జీ ఉన్న కారణంగా తనకి ఎండ పడదని తన పార్ట్ షూటింగ్ ఔట్ డోర్‌లో వున్నపుడు ఎండ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, తన మీద ఎండ పడకుండా షూటింగ్ స్పాట్ మొత్తం క్లాత్‌తో కవర్ చేయాలని సమంత కండిషన్ పెట్టినట్లు చెబుతున్నారు.

సమంత కి గతంలోనే ఈ స్కిన్ ఎలర్జీ వచ్చింది. అందుకోసమే సమంత కొన్ని రోజులు విదేశాలకు వెళ్లి మరీ ట్రీట్మెంట్ తీసుకున్నట్లు తెలిసిన విషయమే. అలాగే మొన్నామధ్యన మండుటెండల్లో రామ్ చరణ్ రంగస్థలం 1985 షూటింగ్ లో కూడా సమంత వడ దెబ్బ తగలడం కారణంగా కొన్ని రోజులు షూటింగ్ కి ప్యాకప్ చెప్పేసి వచ్చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అందుకే సమంత అలా శివ కార్తికేయన్ సినిమాకి కండిషన్ పెట్టింది నిజమే అంటున్నారు.

Similar News