దర్శకధీరు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరో గా నటించడం అంటేనే సినిమాపై ఎలాంటి క్రేజ్ ఉంటుందో ఊహించుకోవచ్చు.ఇప్పటివరకు ఇండస్ట్రీ లో ఉన్న అందరి స్టార్ డైరెక్టర్స్ తో వర్క్ చేసిన మహేష్ బాబు, రాజమౌళి తో మాత్రం ఇప్పటి వరకు వర్క్ చేయలేదు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే మూవీ కోసం అటు మహేష్ ష్యాన్సే కాదు ఇటు తెలుగు సినీ అభిమానులు కూడా ఎంత గానో వెయిట్ చేస్తున్నారు. అయితే దర్శకుడు రాజమౌళి కూడా మహేష్ తో పనిచేయాలని ఉందని పలుసార్లు మనసులో మాటను బయటపెట్టాడు. కానీ ఇప్పటి వరకు వీళ్ళ కలయికలో వచ్చే సినిమా గురించి ఎలాంటి క్లారిటీ లేదు.
అయితే ఇప్పుడు మహేష్ నటించిన స్పైడర్ చిత్రం విడుదల సందర్భంగా రాజమౌళి, మహేష్ బాబుల సినిమా కి సంబంధించిన ఒక న్యూస్ బయటకి వచ్చింది. అదేంటంటే వీరిద్దరి కలయికలో ఒక సినిమా ఒకే అయ్యిందని.... చెబుతున్నారు. అవును నిజమే... మహేష్ స్పైడర్ సినిమా విడుదలకు సంబంధించి జరిగిన ఒక ఇంటర్వ్యూలో మహేష్ బాబు దాదాపు ఈ వార్తను ఖాయం చేసాడు. అయితే వీరి కలయికలో రాబోయే సినిమా మాత్రం 2018 ఆఖరుకు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని మహేష్ చెబుతున్న మాట. ప్రస్తుతం స్పైడర్ విడుదల పనుల్లో ఉన్న మహేష్.... కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అను నేను సినిమా చేస్తున్నాడు. 2018 వేసవికి ఈ సినిమా పూర్తికానుంది. దాని తర్వాత వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ ఒకటి ఉంది. ఇక అది కూడా కంప్లీట్ అయిన తరువాత రాజమౌళి చిత్రం మొదలు పెడతాడన్నమాట