టాక్ ఎలా వున్నా కలెక్షన్స్ ఆగలేదు!!

Update: 2017-06-29 12:00 GMT

అల్లు అర్జున్ - పూజ హెగ్డే నటించిన 'డీజే దువ్వాడ జగన్నాధం' చిత్రం గత శుక్రవారమే విడుదలై టాక్ తో సంబంధం లేకుండా థియేటర్స్ లో దూసుకుపోతుంది. సినిమా ఫస్ట్ షో కే నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయినప్పటికీ అల్లు అర్జున్ క్రేజ్ దృష్ట్యా సినిమా బాక్సాఫీసు వద్ద కలక్షన్స్ ప్రభంజనం సృష్టిస్తోంది. మరి దువ్వాడ చిత్రంలో అల్లు అర్జున్ బ్రాహ్మణ పాత్రలో చేసిన కామెడీవలే నెగెటివ్ టాక్ రావచ్చు గాక.. డీజే పై నెగెటివ్ రివ్యూలు వెలువడచ్చుగాక.. కానీ కలెక్షన్స్ విషయంలో వీర కుమ్ముడు కుమ్ముగాక అన్నట్టు వుంది డీజే వ్యవహారం.

అయితే ఈ చిత్రం ఇలా కలెక్షన్స్ రాబట్టడానికి కారణం రంజాన్ సెలవులు అని.... మళ్ళీ వీక్ మొదలవగానే డీజే కలెక్షన్స్ తగ్గుమొహం పడతాయని భావించారంతా. కానీ రంజాన్ సెలవలుముగిసినా కూడా డీజే కలెక్షన్స్ కి ఢోకా లేదంటున్నారు. మరోపక్క డీజే సినిమా సోషల్ మీడియాలో పైరసీ అయిందని... ఈ విషయమై దర్శక నిర్మాతలు పోలీస్ స్టేషన్స్ చుట్టూ తిరిగినప్పటికీ డీజే కలెక్షన్స్ లో ఏ మార్పులేదని అంటున్నారు. డీజే వరల్డ్ వైడ్ గా 33 కోట్ల కలెక్షన్స్ సాధిస్తే, విడుదలైన 5వ రోజుకే 82 కోట్లు సాధించిందని ఓ ఆంగ్ల పత్రిక ప్రచురించింది.

సినిమాపై నెగెటివ్ టాక్ అనేది అస్సలు ప్రభావం చూపలేదనేది అల్లు అర్జున్ మరోసారి నిరూపించాడు. కేవలం అల్లు అర్జున్ కి ఉన్న క్రేజ్ తోనే డీజే ఈ వసూళ్లు సాధించినది అని మెగా అభిమానులు ఢంకా భజాయిస్తున్నారు. అలాగే పూజ హెగ్డే గ్లామర్ కూడా సినిమాకి ప్లస్ అయ్యిందని కూడా అంటున్నారు. ఏది ప్లస్ అయినా సినిమా అస్సలు బాగోలేదన్నవారికి మాత్రం డీజే కలెక్షన్స్ విషయంలో అస్సలు మింగుడు పడడంలేదంటున్నారు.

Similar News