గోపీచంద్ - సంపత్ నంది కాంబోలో తెరకెక్కిన గౌతమ్ నందా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గోపీచంద్ కెరీర్ లో ఎన్నడు లేని విధంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం గౌతమ్ నంద. పక్క మాస్ మరియు కమర్షియల్ ఫార్ములాతో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు థియేటర్స్ లో సందడి షురూ చేసింది. ఎస్ ఎస్ థమన్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రంలో గోపీచంద్ సరసన కేథరిన్ తెరిస్సా, హన్సికలు నటించారు. ఇకపోతే థియేట్రికల్ ట్రైలర్ తోనే మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు పాసిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.
ఈ చిత్రంలో గోపీచంద్ ద్విపాత్రాభినయం చాలా వరకు ఆకట్టుకుంటుందని..... గౌతమ్ మరియు నందగా గోపీచంద్ రెండు క్యారెక్టర్లలో చాలా చక్కగా నటించాడని చెబుతున్నారు. ఇక గౌతమ్ నందా కథలో సంపత్ నంది రాసుకున్న ట్విస్ట్ లు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసేలా ఉన్నాయని... యాక్షన్ సీన్స్ లో గోపీచంద్ ని దర్శకుడు ఎలా చూపెట్టాలో అలా చూపెట్టడంతో ఈ చిత్రం మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అంటున్నారు. ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే క్యాథెరిన్ కథను మలుపు తిప్పే హీరోయిన్ గా అక్కట్టుకొనగా, హన్సికా అల్లరి పిల్లగా అలరించింది. అయితే ఈ సినిమాకు థమన్ ఇచ్చినా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో ప్లస్ పాయింట్ అని ....పాటల చిత్రీకరణ కూడా చాలా బావుందని టాక్ సొంతం చేసుకుంది ఈ గౌతమ్ నందా చిత్రం.
మరి ప్రస్తుతం కెరీర్ ఒడిదుడుకుల్లో లో ఉన్న గోపీచంద్ కి ఈ గౌతమ్ నందా చిత్రం హిట్టయ్యి మళ్ళీ కెరీర్ ని గాడిన పడేస్తుందనే టాక్ మాత్రం స్ప్రెడ్ అయ్యింది.