టచ్ బావోలేదంటున్నాడు

Update: 2017-09-03 18:00 GMT

రవితేజ లాంగ్ గ్యాప్ తర్వాత తన పుట్టినరోజు సందర్భంగా ఉన్నట్టుండి రెండు సినెమాలను లైన్ లో పెట్టునట్టు ప్రకటించేశాడు. ఒకేసారి మొదలెట్టిన ఈ రెండు సినిమాలను ఏకకాలంలో షూటింగ్ పూర్తి చేసి ఒక నెల అటు ఇటుగా సినిమాలు రెండు విడుదల చేస్తారనుకున్నారు అంతా. అందులో ఒకటి 'రాజా ది గ్రేట్' ని అనిల్ రావిపూడి డైరెక్షన్ లో అంధుడిగా మొదలెట్టాడు. అలాగే 'టచ్ చేసి చూడు'ని మాత్రం విక్రమ్ సిరికొండ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో మొదలెట్టాడు.

అయితే 'రాజా ది గ్రేట్' షూటింగ్ మాత్రం జెట్ స్పీడు తో దూసుకుపోతుంటే.... విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'టచ్ చేసి చూడు' షూటింగ్ మాత్రం నత్తనడకన సాగుతుందని.... అసలు షూటింగ్ ఆగిపోయింది వార్తలు ప్రచారంలోకొచ్చేశాయి. ఈ సినిమాని ఎప్పుడు టచ్ చేసినా రవితేజకి చుక్కలే కనబడుతున్నాయట. విక్రమ్ దర్శకత్వానికి కొత్తకాబట్టి అతని మేకింగ్ స్టైల్ రవితేజకి అస్సలు నచ్చడంలేదట. అందుకే అనవసరంగా ఈ సినిమాకి ఎందుకు మొదలెట్టనా అని అరవితేజ ఇప్పుడు బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాడట.

'రాజా ది గ్రేట్' కన్నా ముందే 'టచ్ చేసి చూడు' పూర్తవల్సి ఉండగా.. రవితేజ డెసిషన్స్ వలన ఈ సినిమాని పక్కనపెట్టేసి.. పూర్తి దృష్టి 'రాజా ది గ్రేట్' మీద పెట్టేసాడట. ఇక ఈ చిత్రం షూటింగ్ చివరిదశలో ఉంది. సినిమా విడుదల తేదీ కూడా త్వరలోనే ప్రకటించనున్నారట. మరి కొన్నాళ్ళు 'టచ్ చేసి చూడు'కి బ్రేక్ ఇచ్చిన రవి మళ్ళీ దాన్ని మొదలెట్టే ప్రయత్నం చేసినా ఇప్పటికి అది నెగెటివ్ రిజల్టే వస్తుందట. అందుకే 'రాజా ది గ్రేట్' పూర్తయ్యేవరకు 'టచ్ చేసి చూడు' ని టచ్ చెయ్యకూడదని... అప్పుడే ఒక నిర్ణయానికి రావాలని రవితేజ అనుకుంటున్నాడట. అంటే సినిమా సెట్స్ మీదుంటుందా లేదా అనేది కూడా అప్పుడే ఒక క్లారిటీకి వస్తాడన్నమాట..

Similar News