టచ్ చేసి చూడు మొదటి రోజు కలెక్షన్స్ ఎంతంటే

Update: 2018-02-05 05:03 GMT

రవితేజ హీరోగా రాశి ఖన్నా, సీరత్ కపూర్ లు హీరోయిన్స్ గా నటించిన టచ్ చేసి చూడు సినిమా శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మొదటి షోకే నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. రవితేజ ఎనర్జీ, రవితేజ క్రేజ్ కూడా ఈ సినిమాకి కలెక్షన్స్ తేలేకపోయింది. మరి రవితేజ కెరీర్ లోనే మరి ఘోరమైన కలెక్షన్స్ రాబట్టినట్టుగా తెలుస్తుంది. టచ్ చేసి చూడు సినిమా తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున ఎంత సంపాదించిందో మీరు చూడండి.

నైజామ్: 1.56 కోట్లు

సీడెడ్: 47 లక్షలు

నెల్లూరు: 20 లక్షలు

గుంటూరు: 47 లక్షలు

కృష్ణా 23 లక్షలు

వెస్ట్ గోదావరి: 30 లక్షలు

ఈస్ట్ గోదావరి: 45 లక్షలు

ఉత్తరాంధ్ర: 48 లక్షలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజున ఈ సినిమా 4.16 కోట్ల షేర్ ను రాబట్టింది.

Similar News