జ్యో సెకండ్ ఇన్నింగ్స్ టర్నింగ్ పాయింట్ బాల చేతిలో ఉందా?

Update: 2018-01-15 08:37 GMT

తమిళ దర్శకుడు బాల పేరు పరిచయం లేని సినిమా అభిమానులు ఉండరు అనటంలో అతిశయోక్తి లేదేమో. వరుస బాక్స్ ఆఫీస్ విజయాలతోనో లేక బ్యాక్ తో బ్యాక్ సినిమాలతోనే ఆయన ఫేమ్ ముడిపడి ఉండదు. తమిళనాడు లోని అతి దారుణమైన స్లం ఏరియా లలో నుంచి ఆయన చిత్ర కథలు ప్రాణం పోసుకుంటుంటాయి. అలాంటి కథలకి ఎలాంటి సినిమా గ్లామర్ కోటింగ్ పూయకుండా అతి సహజంగా తమిళనాడు స్లం లలో కెమెరా పెట్టి వదిలేసినట్టుగా బాల సినిమాలో లొకేషన్స్ అనిపిస్తుంటాయి. విజయాపజయాలకి అతీతంగా ఆయన చిత్రాలలో ఒక్కసారైనా నటించి తమలోని నటనా ప్రతిభని సాన పెట్టుకోవటానికి ఆరాటపడే నటీనటులు ఎందరో.

36 వయధినిలే చిత్రంతో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ప్రముఖ కథానాయిక జ్యోతిక ఇటీవల కాలంలో మగలీర్ మట్టుమ్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే ఈ చిత్రాలు జ్యోతిక కి సౌండ్ గుడ్ బౌన్స్ బ్యాక్ కాలేకపోయాయి. ప్రస్తుతం బాల దర్శకత్వంలో నటిస్తున్న నాచ్చియార్ చిత్రంలో మాస్ లక్షణాలు కొట్టొచ్చే పోలీస్ అధికారిగా నటిస్తుంది జ్యోతిక. ఇటీవల విడుదలైన చిత్ర ట్రైలర్ మరొకసారి బాల మార్క్ కంటెంట్ ఖాయం అనే సంకేతాలు ప్రేక్షకులకి పంపుతుంది. మరో వైపు జ్యో తన నట శిఖరాన్ని ప్రదర్శించినట్టుగా శాంపిల్ ట్రైలర్ లో వదిలి సినిమా కోసం ఎదురు చూసేలా చేసింది. మరి శివపుత్రుడు చిత్రంతో తన భర్త సూర్య కి మంచి బ్రేక్ ఇచ్చిన బాల దర్శకత్వంలోనే జ్యోతిక సెకండ్ ఇన్నింగ్స్ కూడా షైన్ అవుతుందేమో చూద్దాం.

Similar News