'జైసింహా' సెన్సార్ టాక్‌.. సినిమా ఎలా ఉందంటే

Update: 2018-01-04 16:37 GMT

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ జైసింహా ఎప్పుడెప్పుడు థియేట‌ర్ల‌లోకి వ‌స్తుందా ? అని బాల‌య్య అభిమానుల‌తో పాటు నంద‌మూరి అభిమానులు కూడా ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తున్నారు. 12న రిలీజ్ అవుతోన్న జైసింహా గురువారం సాయంత్రం సెన్సార్ ప‌నులు కంప్లీట్ చేసుకుంది. సినిమా చూసిన సెన్సార్ బోర్డు స‌భ్యులు జైసింహాకు U / A స‌ర్టిఫికేట్ జారీ చేశారు.

బాల‌య్య మార్క్ ఎక్క‌డా మిస్ కాకుండా ఉన్న ఈ సినిమాలో యాక్ష‌న్ సీన్లు అదిరిపోయే రేంజ్‌లో ఉన్నాయ‌ని సెన్సార్ రిపోర్టు ద్వారా టాక్ భ‌య‌ట‌కు వ‌చ్చింది. ఎప్ప‌టి లాగానే బాల‌య్య మార్క్ డైలాగ్స్‌తో పాటు యాక్ష‌న్ సీన్లు అదిరిపోయాయ‌ట‌. ‘‘ఎవరిని ఉంచాలో.. ఎవరిని లేపాలో అక్కడ ఉంటాది లెక్క. మీవాడి నుదిటి మీద బతుకు గీత లేదు. విధి రాత లేదు.. ఆయష్షు రేఖ లేదు. అక్కడ యుద్ధం చేసినా.. ఇక్కడ నీ పొగరు మారకపోతే బేవకూఫ్’’.. అంటూ బాలయ్య చెప్పే ప‌వ‌ర్ ఫుల్ డైలాగుల‌కు సినిమాలో కొద‌వ‌లేద‌ని తెలుస్తోంది.

సెకండాఫ్ మొత్తం వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్ష‌న్ సీన్ల‌తో అదిరిపోయిన‌ట్టు తెలుస్తోంది. ఓవ‌రాల్‌గా జైసింహా బాల‌య్య మార్క్ యాక్షన్ సినిమాగా ఉండ‌నుంద‌ని తెలుస్తోంది. సీ క‌ళ్యాణ్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు కేఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. చిరంత‌న్ భ‌ట్ మ్యూజిక్ ఇస్తోన్న ఈ సినిమాలో బాల‌య్య‌కు జోడీగా న‌య‌న‌తార - హ‌రిప్రియ - న‌టాషాదోషీ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. బాల‌య్య జైసింహాగా బాక్సాఫీస్ ద‌గ్గర ఎలా గ‌ర్జిస్తాడో ? ఈ నెల 12న చూడాలి.

Similar News