జై లవ కుశ ఫస్ట్ డే లెక్కలు చూస్తారా?

Update: 2017-09-22 07:15 GMT

దసరా సెలవులని క్యాష్ చేసుకోవడానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కె ఎస్ రవీందర్ కలయికలో తెరకెక్కిన జై లవ కుశ చిత్రం నిన్న గురువారమే థియేటర్స్ లోకి దిగిపోయింది. విడుదలైన అన్ని చోట్లా మిశ్రమ స్పందనతో దూసుకుపోతుంది జై లవ కుశ. జై లవ కుశలోని జై పాత్రకి ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. జై పాత్ర వలనే.... జై లవ కుశ సినిమా బావుందని.... జై పాత్రని చాలా పవర్ ఫుల్ గా తీర్చిదిద్ది సినిమా సక్సెస్ అవడానికి కారణమయ్యారు అంటున్నారు. ఇక చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్ లోను భారీ ఎత్తున విడుదలైంది. ఇక భారీ ఎత్తున విడుదలైన ఈ చిత్రం భారీగానే కలెక్షన్స్ కుమ్మేస్తున్నట్టు చెబుతున్నారు.

జై లవ కుశ మొదటి రోజున ప్రపంచ వ్యాప్తంగా 15 నుంచి 20 కోట్ల మధ్య వసూలు చేసినట్లు సమాచారం అందుతుంది. ఇక జై లవ కుశ ప్రీమియర్ షో‌ల ద్వారా ఓవర్సీస్‌లో మూడున్నర కోట్ల రూపాయలు వసూలు చేసింది అని బాలీవుడ్ ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ అదర్స్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసాడు. ఇక ఏపీ విజయవాడలో కూడా జై లవ కుశ కోటి 70 లక్షలు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. మరి ఇదే స్పీడు ఈ వారమంతా ఉంటేనే జై లవ కుశ బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్స్ గట్టెక్కుతారని చెబుతున్నారు. ఎందుకంటే జై లవ కుశ విడుదలకు ముందే 100 కోట్ల పై మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ వారం జై లవ కుశ ట్రేడ్ లెక్కలు ఎలా ఉండబోతున్నాయో... చూద్దాం.

Similar News