ఎన్టీఆర్ - బాబీ డైరెక్షన్ లో కళ్యాణ్ రామ్ నిర్మాతగా తెరకెక్కుతున్న 'జై లవ కుశ' చిత్ర పాటలు ఎప్పుడెప్పుడు విడుదలవుతాయా? ఎప్పుడెప్పుడు విందామా? అని ఎన్టీఆర్ ఫాన్స్ తో పాటే సదరు ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. ఇక 'జై లవ కుశ' ఆడియో వేడుకలో తమ అభిమాన హీరో స్పీచ్ వినడానికి ఫాన్స్ రెడీ అవుతున్న వేళ 'జై లవ కుశ' ఆడియో వేడుకని సెప్టెంబర్ 3 న రద్దు చేస్తున్నట్టు ఎన్టీఆర్ ఆర్ట్స్ అధికారికంగా ప్రకటించింది. 'జై లవ కుశ' ఆడియో ని వచ్చే నెల 3 న భారీ లెవల్లో నిర్వహించాలని చిత్ర టీమ్ ప్లాన్ చేసింది. కానీ ఇప్పుడు ఆ రోజున ఆడియో నిర్వహించడానికి గణేష్ నిమజ్జనం, భారీ వర్షాల కారణంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టే ఈ వేడుకని రద్దు చేసినట్టు ఎన్టీఆర్ ఆర్ట్స్ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.
తెలంగాణాలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ హెచ్చరిక కారణంగా, గణేష్ నిమజ్జనం తో హైదరాబాద్ అంతా హడావిడిగా ఉండడం ఆడియో వేడుక దగ్గర ఫాన్స్ హంగామాతో సెక్యూరిటీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉండడంతోనే ఈ వేడుకని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇక సెప్టెంబర్ 3 న 'జై లవ కుశ' పాటలన్ని నేరుగా మార్కెట్ లోకి వదిలేస్తామని కూడా చెప్పింది. అలాగే ఫాన్స్ ఎవరు డిస్పాయింట్ కావొద్దని 'జై లవ కుశ' విడుదల సందర్భగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ని సెప్టెంబర్ 10 న గ్రాండ్ లెవల్లో నిర్వహించబోతున్నట్లు... అదే రోజున 'జై లవ కుశ' థియేట్రికల్ ట్రైలర్ ని కూడా విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నట్టు ప్రకటించారు.
ఇక జై లవ కుశ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా... రాశి ఖన్నా, నివేత థామస్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.