స్టార్ హీరోల సినిమాలు ఏమైనా విడుదలవుతున్నాయి అంటే... విడుదలకు ఒకరోజు ముందే ఆ సినిమా హిట్ లేదా ఫట్టా అనే విషయం దుబాయ్ నుండి రిపోర్ట్ వచ్చేస్తుంది. ఎలా అంటే... దుబాయ్ సెన్సార్ బోర్డు మెంబెర్ ఉమైర్ సంధు అనే క్రిటిక్ స్టార్ హీరోల సినిమాలకు విడుదలకు ఒకరోజు ముందే సినిమా ఫలితాన్ని చెప్పేస్తుంటాడు. ఇక ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ నటిస్తున్న జై లవ కుశ రిపోర్ట్ కూడా అందించేసాడు. జై లవ కుశ సూపర్ హిట్ అని.... ఎన్టీఆర్ అభిమానులను ఆనందోత్సహాల్లో మునిగితేలేటట్టు చేసాడు. సెన్సార్ బోర్డు సభ్యులుకు వేసిన జై లవ కుశ షో ని చూశానని.. సినిమా చాలా బావుందంటూ సోషల్ మీడియాలో తన ఒపీనియన్ చెప్పేసాడు.
దర్శకుడు బాబీ జై లవ కుశ ని అద్భుతంగా తెరకెక్కించాడని... స్టోరీ, స్క్రీన్ ప్లే లో చాలా మాస్ ఎలిమెంట్స్ ఉంటాయని.. ఫస్ట్ హాఫ్ అంతా క్లాస్ గా ఉంటే సెకండ్ హాఫ్ అంటా మాసివ్ గా ఉంటుందని తన రిపోర్ట్ ని అందించాడు. ఇక జై లవ కుశ క్లైమాక్స్ సూపర్ అంటూనే.... జై లవ కుశ యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకు మంచి ట్రీట్ ఇస్తాయని చెబుతున్నాడు. జై లవ కుశ హీరోయిన్స్ విషయానికి వస్తే రాశి ఖన్నా, నివేత థామస్ లు అందంలోను అభినయంలోనూ పోటీ పడ్డారని..... తమన్నా ఐటెం సాంగ్ అదుర్స్ అంటూ జై లవ కుశాని ఆకాశానికెత్తేసాడు. జై లవ కుశలో ఎన్టీఆర్ మూడు పాత్రలు అద్భుతమంటూ.. జై పాత్రలో ఎన్టీఆర్ నటన అమోఘం అంటున్నాడు.
ఇక జై లవ కుశ లో నెగెటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయని.... కొన్ని చోట్ల సన్నివేశాలు చాలా లెంగ్దిగా ఉన్నాయని.... అవి కొంచెం బోర్ కొట్టిస్తాయని.... ఎడిటింగ్ విషయంలో జై లవ కుశ టీమ్ మరి కాస్త శ్రద్ద పెట్టాల్సిందంటూ జై లవ కుశ కు తానిచ్చే రేటింగ్ 3.5 /5 అంటూ రేటింగ్ కూడా ఇచ్చేసాడు. మరి ఉమైర్ సంధు చెప్పినట్లుగా జై లవ కుశ సినిమా గనక హిట్ టాక్ పడితే సినిమా కలెక్షన్స్ భారీ స్థాయిలో ఉంటాయి. ఎలాగూ స్పైడర్ వచ్చేవరకు జై లవ కుశ నే హవా కొనసాగిస్తుండడం లో సందేహం లేదుగాని... సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే గనక స్పైడర్ తోపాటు దూసుకుపోతుంది. అదే నెగెటివ్ టాక్ పడితే ఒక వారానికే చేతులెత్తేస్తుంది . చూద్దాం మరికొన్ని గంటల్లోనే జై లవ కుశలో విషయం ఎంతుందో తేలిపోతుంది.