'జై లవ కుశ' ని చూసి భయపడుతున్నారు

Update: 2017-08-27 13:18 GMT

'స్పైడర్' చిత్ర విడుదల డేట్ కేవలం ఒక్కనేల మాత్రమే ఉంది. మరోపక్క సాంగ్స్ షూటింగ్ అంటూ మురుగదాస్ 'స్పైడర్' సాంగ్స్ తెరకెక్కిస్తున్నాడు. మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని మొదలెట్టిన 'స్పైడర్' టీమ్ పబ్లిసిటీ కార్యక్రమాలను మొదలుపెట్టినట్లే కనబడుతుంది. ఈ మధ్యన 'స్పైడర్' ఫొటోస్ లో మహేష్ లుక్ ని ఒక్క్కక్కటిగా వదులుతూ హడావిడి చేస్తుంది. కానీ ఈ ఫొటోస్ లో మహేష్ లుక్స్ అన్ని ఒకేలా వున్నాయనే ఫిలింగ్ లో మహేష్ ఫాన్స్ కొట్టుకుపోతున్నారు. మురుగదాస్ వదిలిన స్టిల్స్ నే మరల మరలా వదులుతున్నాడనే ఫీలింగ్ లో మురుగదాస్ మీద ఫైర్ అవుతున్నారట మహేష్ ఫాన్స్.

అలాగే మరో హీరో ఎన్టీఆర్ మాత్రం 'జై లవ కుశ' ప్రమోషన్స్ లో చరిత్ర సృష్టిస్తున్నాడని మహేష్ ఫాన్స్ కొట్టేసుకుంటున్నారట. ఎన్టీఆర్ మాత్రం 'జై' టీజర్, 'లవ' టీజర్, 'కుశ' లుక్ తో స్పెషల్ పబ్లిసిటీ చేస్తుంటే 'స్పైడర్' చిత్ర టీమ్ మాత్రం మహేష్ లుక్స్ లో ఏ మాత్రం కొత్తదనం చూపడం లేదని.... అలాగే రెండు టీజర్స్ మాత్రమే వదిలి మిగతా ప్రమోషన్ కార్యక్రమాలను పెద్దగా పట్టించుకోవడంలేదని అంటున్నారట. 'స్పైడర్' లో పెద్దగా స్పెషల్ ఏం కనబడడంలేదనే ఫీలింగ్ లో ఉన్న మహేష్ ఫాన్స్.... ఎన్టీఆర్ 'జై లవ కుశ' పబ్లిసిటీతో పోలిస్తే 'స్పైడర్' పబ్లిసిటీ చాలా పేలవంగా ఉందంటున్నారట.

అయితే మహేష్ ఫాన్స్ అంటున్నట్టు ఏం లేదని... 'స్పైడర్' చిత్రంలో మహేష్ కొత్తగా ఉంటాడని.. అలాగే మహేష్ తమిళ లాంచింగ్ ఈవెంట్ కనివిని ఎరుగని రీతిలో చేపడుతూన్నామని.... అలాగే అదేరోజు 'స్పైడర్' థియేట్రికల్ ట్రైలర్ విడుదలకు ప్లాన్ చేస్తున్నామని చిత్ర యూనిట్ చెబుతుంది. అలాగే ఎన్టీఆర్... జై లవ కుశలో మూడు పాత్రలో కనిపిస్తాడు కాబట్టి మూడు రకాల లుక్స్ఆకట్టుకుంటున్నాడు గాని 'జై లవ కుశ' కు కూడా పెద్ద స్పెషల్ ఏం లేదంటున్నారట. అందుకే ఇప్పుడు 'స్పైడర్' కి సంబందించిన మహేష్, రకుల్ తో రొమాన్స్ చేస్తూ క్లోజ్ గా వుండే పిక్ ని మహేష్ ఫాన్స్ కోసమే చిత్ర యూనిట్ వదిలినట్టుగా చెబుతున్నారు.

Similar News