వచ్చే బుధవారమే అంటే ఎల్లుండే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళం, ఓవర్సీస్ లో కూడా మహేష్ బాబు హీరోగా నటించిన 'స్పైడర్' సందడి షురూ కానుంది. మరి గత గురువారం విడుదలై 'జై లవ కుశ' తన పెట్టుబడిని రాబట్టిందా? అసలు ఎన్టీఆర్ నటించిన జై లవ కుశ కలెక్షన్స్ ఎంత? విడుదలైన నాలుగు రోజుల్లో జై లవ కుశ ఎంత వసూలు చేసింది? అసలు సేఫ్ జోన్ లో ఉందా లేకుంటే బయ్యర్లకు నష్టాలూ మిగిల్చే దిశగా థియేటర్స్ లో రన్ అవుతుందా? అనే అనుమానాలు పలువురి మదిలో మెదులుతున్నాయి. అయితే 'జై లవ కుశ' నాలుగు రోజులకి 70 కోట్ల పైమెరే వసూలు చేసినట్లుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.
అయితే ఇప్పుడు 'జై లవ కుశ' నాలుగు రోజుల కలెక్షన్స్ విషయానికి వస్తే ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలతో కలిపి ఈ నాలుగు రోజుల్లో 10 కోట్లు రాబట్టినట్టు సమాచారం. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో అంటే ఏపీ, తెలంగాణ విషయానికి వస్తే నాలుగురోజులకు గాను 40 కోట్లు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్న మాట. అయితే ఈ సోమవారం, మంగళవారం ఎలా వున్నా బుధవారం నుంచి ‘స్పైడర్’ మొదలుకావడంతో ‘జైలవకుశ’ కలెక్షన్లు డ్రాప్ కావచ్చని అంటున్నారు. అయితే 'జై లవ కుశ' కు రెస్టాఫ్ ఇండియా, కర్ణాటక ఇలా అన్నీ కలిపితే మరో 5 కోట్లు రావచ్చనని అంటున్నారు. అంటే నాలుగురోజులకు 55 కోట్లు అన్నమాట.
ఏపీ - తెలంగాణ జై లవ కుశ నాలుగు వారాల లెక్కలు మీకోసం:
నైజాం- 11.60 కోట్లు
సీడెడ్- 8.10
ఉత్తరాంధ్ర- 4.19
ఈస్ట్ - వెస్ట్- 6.64
కృష్ణ- 3.20
గుంటూరు- 4.46
నెల్లూరు- 1.69 కోట్లు.