'జై లవ కుశ' క్లోసింగ్ బిజినెస్

Update: 2017-11-03 13:00 GMT

'జై లవకుశ' సినిమా విడుదల అయ్యి నెలన్నర కావొచ్చింది. ఈ సినిమా విడుదలైనప్పుడు మిశ్రమ స్పందనతో మంచి మార్కులే వేయించుకుంది. అయితే ఈ సినిమాకి పెట్టుబడి పెట్టిన ప్రొడ్యూసర్ కళ్యాణ్ రామ్ ఈ సినిమాను ముందుగానే అమ్ముకుని ప్రాఫిట్స్ లో వున్నాడు. కానీ కొనుకున్న డిస్ట్రిబ్యూటర్స్ కి మాత్రం ఈ సినిమా టాక్ వల్ల పెద్దగా లాభాలు వెనకేసుకోలేదు. కొన్ని ఏరియాస్ లో పర్లేదు అనిపించిన ఈ సినిమా కొన్ని ఏరియాస్ లో మాత్రం డీలా పడిపోయింది. 'జై లవకుశ' సినిమా క్లోసింగ్ వచ్చేసరికి ఏపీ & టీఎస్ కలిపి 58 కోట్ల షేర్ వద్ద ఆగిపోయింది. 'జై లవకుశ' సినిమా ఏపీ & టీఎస్ క్లోసింగ్ షేర్ వివరాలు మీకోసం...

ఏరియా షేర్స్ కోట్లలో

నైజాం 16.09

సీడెడ్ 12.49

యూఏ 7.18

తూర్పు గోదావరి 5.60

పశ్చిమ గోదావరి 3.70

కృష్ణ 4.70

గుంటూరు 6.05

నెల్లూరు 2.54

ఏపీ & టీఎస్ టోటల్: 58.31 కోట్లు

Similar News