తన కెరీర్ లోనే జై లవ కుశ చిత్రంలో మొదటిసారి త్రిపాత్రాభినయం చేసిన ఎన్టీఆర్.. ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోకపోయినా హిట్ అయితే అందుకున్నాడు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రాశి ఖన్నా, నివేద థామస్ లు హీరోయిన్స్ గా నటించారు. దేవిశ్రీ సంగీతం అందించిన ఈ చిత్రంలో తమన్నా ఐటెం సాంగ్ లో నటించింది. నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ సినిమాతో ఆయన బాగానే లాభాలు వెనకేసుకున్నాడు. సినిమా విడుదలకు ముందు ప్రి రిలీజ్ బిజినెస్ లోనే రికార్డు సృష్టించిన జై లవ కుశ సినిమా, విడుదల తర్వాత బాక్సాఫీసు వద్ద కూడా బాగానే కలెక్షన్స్ కొల్లగొట్టింది. జై లవ కుశ టోటల్ రన్ లో 75.34 కోట్లు కొల్లగొట్టి తారక్ కెరీర్ లోనే సెకండ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం వరసగా మూడోసారి తారక్ ని 1.5 మిలియన్ డాలర్ల క్లబ్బులో చేరడంతో..... ఈ రేర్ ఫీట్ సాధించిన మొదటి సౌత్ ఇండియన్ హీరోగా ఎన్టీఆర్ రికార్డు సృష్టించాడు. ఇక నిన్న గురువారంతో 50 రోజులు పూర్తి చేసుకున్న జై లవ కుశ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఏరియాల వారీగా...
ఏరియా కలెక్షన్స్ (కోట్లలో)
నైజామ్: 16 .02
సీడెడ్: 12 .04
వైజాగ్: 7 .18
తూర్పు గోదావరి: 5 .57
పశ్చిమ గోదావరి: 3 .70
కృష్ణ 4 .69
గుంటూరు: 6 .05
నెల్లూరు: 2 .54
టోటల్ ఏపీ మరియు తెలంగాణ 57 .79 కోట్లు
కర్ణాటక: 7 .48
తమిళనాడు: 1 .30
ఓవర్సీస్: 5 .10
రెస్టాఫ్ ఇండియా: 1 .15
రెస్టాఫ్ వరల్డ్: 2 .52
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ మొత్తం: 75 .34 కోట్లు