బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'జై లవ కుశ' ఈ నెల 21 న విడుదలకు సిద్ధంగా వుంది. సినిమా విడుదల దగ్గర పడుతున్న కొద్దీ 'జై లవ కుశ' ప్రమోషన్ కార్యక్రమాలకు చిత్ర బృందం భారీ లెవల్లో శ్రీకారం చుట్టింది. ఇప్పటికే 'జై లవ కుశ' పాటలు మార్కెట్ లో హల్చల్ చేస్తున్నాయి. అలాగే వచ్చే ఆదివారం 'జై లవ కుశ' ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా భారీ లెవల్లో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. అభిమానులందరినీ ఈ ఈవెంట్ కి ఆహ్వానించి వారి సమక్షంలోనే ఈ ఈవెంట్ ని సక్సెస్ చెయ్యాలని చూస్తున్నారు.
ఇకపొతే 'జై, లవ, కుశ' గురించి రోజుకో న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. జై పాత్రలో ఎన్టీఆర్ విజ్రంభించి నటించాడని చిత్ర బృందం నుండి అందుతున్న సమాచారం. ముఖ్యంగా జై పాత్రను రావణాసురుడుతో పోలుస్తూ తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉందంటుంది చిత్ర యూనిట్. ఇక ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు. ఒకరు రాశి ఖన్నా, రెండో హీరోయిన్ నివేత థామస్. అయితే ముగ్గురు పాత్రలకు కేవలం రెండు పాత్రలకే హీరోయిన్స్ ఉండగా.. జై విలన్ కాబట్టి అతని పాత్రకి హీరోయిన్ లేదనుకున్నారు అంతా. కానీ జై పాత్రకి రాశి ఖన్నా ఉందనే విషయం తాజాగా విడుదలైన 'జై లవ కుశ' పిక్స్ లో అర్ధమవుతుంది. ఆ స్టిల్స్ లో జై పాత్రతో రాశి ఖన్నా హాట్ రొమాన్స్ సూపర్ గా ఉందంటున్నారు.
ఇక లవ పాత్రకు నివేత థామస్, మరి కుశ పాత్రకి హీరోయిన్ లేనట్టే అంటున్నారు. కుశ పాత్ర 'జై లవ కుశ'లో ఆధ్యంతం నవ్విస్తూనే ఉంటుందని... అతని పాత్రకి మాత్రం ఐటెం గర్ల్ తామన్నతోనే సరిపెట్టేస్తారంటున్నారు. తమన్నా ఐటెం తోనే కుశ స్టెప్పులు వేసుకుంటాడని అంటున్నారు. మరి ఈ మూడు పాత్రలతో ఎన్టీఆర్ నటన అద్భుతః అనే రీతిలో ఉండబోతుందని చెబుతున్నారు. చూద్దాం ఈ నెల 21 న ఏం జరగబోతుందో...!