కరీనా కపూర్ బాలీవుడ్ కి జీరో సైజు ని పరిచయం చేసిన భామ. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే సైఫ్ అలీ ఖాన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న కరీనా .. ఒక బాబుకి కూడా తల్లయింది. ఆ బాబుకి సైఫ్ అండ్ కరీనా తైమూర్ అలీ ఖాన్ అని ముద్దుగా పేరు కూడా పెట్టేసారు. ఇక కరీనాకు పెళ్ళై... బాబు పుట్టాక కూడా కూడా తన కెరీర్ ని వదిలిపెట్టడం లేదు.కరీనా ప్రెగ్నెంట్ గా ఉండి నెలలు నిండినాక కూడా ఫోటో షూట్స్ తో హడావిడి చేసిన సంగతి తెలిసిందే.ఇక తైమూర్ కి జన్మనిచ్చాక కూడా కరీనా పూర్తి ఫిట్నెస్ సాధించి..... మళ్లీ సినిమాల కోసం రెడీ అయ్యింది. ఇక ఇప్పుడు కరీనా రోజుకో ఫోటో షూట్ తో తాను సినిమాలకు రెడీ అనే సంకేతాలను బాలీవుడ్ దర్శక నిర్మాతలకు పంపుతోంది.
ఇక ఇప్పుడు కరీనా హాట్ ఫోటో షూట్ చూస్తే మాత్రం సంతూర్ మమ్మి కన్నా ఎంతో అందంగా అదే విధంగా హాట్ గా కనబడుతూ... మతులు పోగోడుతింది. మరి ఆ ఫొటోస్ చూస్తుంటే మాత్రం అసలు కరీనా కి పెళ్లయిందని.. ఒక బాబు ఉన్నాడంటే నమ్మకమే కలగడం లేదంటారు. అయితే మరోసారి కరీనా జీరో సైజు కి ప్రయత్నిస్తుందా అనే ప్రశ్నకు కరీనా మాత్రం... నాలో అప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులొచ్చాయ్.. ఇకపై జీరోసైజ్ ఫిజిక్ నాకు కష్టమే కావొచ్చు.. అలాగని అసాధ్యం కూడా కాదు. ఏమో, భవిష్యత్తులో మళ్ళీ అలాంటి ప్రయత్నం చేయొచ్చునేమో.. ప్రస్తుతానికైతే ఫిట్‌నెస్ కాపాడుకునేందుకు మాత్రమే ప్రయత్నిస్తున్నాను అని చెప్పింది.
మరి సినిమాల్లో ప్రస్తుతం అవకాశాలు లేక ఇలా హాట్ ఫోటో షాట్స్ కి ఫోజులిస్తున్న బెబో.. కి త్వరలోనే ఒక మంచి అదిరి పోయే ఆఫర్ రావాలని ఆశిద్దాం.