జిమ్ లో విపరీతమైన వర్కౌట్స్ తో బాడీ ట్యూన్ చేస్తోంది

Update: 2018-01-05 11:26 GMT

సినిమా ఆర్టిస్టులు అందరికి వుండే కామన్ కష్టం మంచి ఆకర్షణీయమైన బాడీ షేప్ మైంటైన్ చేయటమే. అందులోనూ యువ కథానాయికలకు ఇది మాండేటరీ. అందుకే పాపం గంటలు తరబడి జిమ్ లో శ్రమిస్తూ వారి ఫీజిక్ ని కాపాడుకుంటూ వుంటారు. ప్రస్తుతం అందాల భామ క్యాథెరిన్ ట్రెసా ఇదే పనిలో తెగ కష్టపడిపోతుంది. అడపా దడపా స్టార్ హీరోస్ సరసన నటిస్తూ విజయవంతమైన చిత్రాలు ఖాతాలో వేసుకుంటునప్పటికీ స్టార్ హీరోయిన్ హోదా అమ్మడికి దక్కక తెగ ఇబ్బంది పడిపోతుంది.

గత ఏడాది వచ్చిన నేనే రాజు నేనే మంత్రి లో హీరోయిన్ పాత్ర కానప్పటికీ ఎక్కువ నిడివి వున్న సపోర్టింగ్ హీరోయిన్ పాత్రలో ఒకింత నెగెటివ్ షేడ్ లో కనిపించి కూడా ప్రేక్షకుల మన్ననలు పొందిన క్యాథెరిన్ కి తెలుగులో వరుస అవకాశాలు మాత్రం వరించటం లేదు. ఇప్పటికే పైసా చిత్రం లో బొద్దుగా కనిపించిన తన లుక్ నుంచి నాజూకుగా మారిన క్యాథెరిన్ తన బాడీ షేప్స్ ని మరింత ఆకర్షణీయంగా ట్యూన్ చేసుకోవటానికి అధిక సమయం జిమ్ లో కఠిన తరమైన వర్క్ ఔట్స్ చేస్తూ గడిపేస్తోంది పాపం. మరి క్యాథెరిన్ శ్రమ ఫలిచించి స్టార్ స్టేటస్ హోదా అనుభవించే స్థాయిలో సినిమా అవకాశాలు వెలువెత్తుతాయేమో చూద్దాం.

Similar News