జాన్వీ కోసం అంతపని చేశాడా?

Update: 2018-02-11 08:01 GMT

ఒకప్పట్లో హీరోయిన్ గా శ్రీదేవి అందరి మనసుల్ని దోచేసింది. శ్రీదేవి కున్న అభిమానులు ఏ హీరోయిన్ కి లేరంటే నమ్మాలి. అలాంటి శ్రీదేవి పోయిపోయి ఒక పెళ్ళై పిల్లలున్న బోని కపూర్ ని పెళ్లాడడం ఎవరికీ రుచించలేదు. అయినా శ్రీదేవి ఎక్కడా తొణక్కుండా బెణక్కుండా ఇద్దరు అమ్మాయిలను కనేసింది. ఇక అప్పటినుండి ఆ ఇద్దరి అమ్మాయిలను కంటికి రెప్పలా చూసుకుంటూ తన సినీ జీవితానికి గుడ్ బాయ్ చెప్పేసింది. అయితే అప్పట్లో శ్రీదేవి ఎలా ఉండేదో ఇప్పటికి తన కూతుళ్లు వయసుకు వచ్చినా కూడా అంతే వన్నె తరగని అందంతో నిగ నిగలాడుతుంది. అయితే శ్రీదేవి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని ఆమె పెద్ద కూతురు జాన్వీ కపూర్ కూడా వెండి తెరను ఏలడానికి సిద్దమయ్యింది.

షాహిద్ కపూర్ త‌మ్ముడు ఇషాన్ ఖ‌ట్ట‌ర్ తో కలిసి జాన్వీ కపూర్ మరాఠీ సైర‌త్ సినిమా రీమేక్ ధ‌డ‌క్‌ లో నటిస్తుంది. ప‌రువు హ‌త్య‌ల నేప‌థ్యంలో న‌డిచే సున్నిత మైన ప్రేమ క‌థ‌ తో తెరకెక్కుతున్న ఈ సినిమా హీరో హీరోయిన్స్ అయిన ఇషాన్‌, జాన్వీ లకు ఇది తొలిసినిమా కావడం విశేషం. ఈ సినిమా కోసం చాలా శిక్ష‌ణ తీసుకుంటున్నారిద్దరు. సినిమా మొదలైనప్పటినుండి భారీ అంచనాలతో ముందుకెళుతున్న ఈ సినిమాపై ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది. అదేమిటంటే ఇషాన్ ఖ‌ట్ట‌ర్, జాన్వీ కోసం బాల్క‌నీ గోడ‌లు దూకేస్తున్నాడట. ఇంతకీ విషయం ఏమిటంటే.... హీరో ఇషాన్ రియల్ లైఫ్ లో జిమ్ కు వెళ్ల‌గా.... ఇషాన్ ని పిక‌ప్ చేసుకునేందుకు జాన్వీ ఆ జిమ్ దగ్గరికి వెళ్లిందట.

అయితే ఆ సమయంలో ఇషాన్ కోసం జాన్వీ కారులో వెయిట్ చేస్తుండ‌గా... చాలా మంది ప్ర‌జ‌లు, మీడియా ఆ భ‌వ‌నం ముందు గుమిగూడారట. ఈ విష‌యం జిమ్‌లో ఉన్న ఇషాన్ కు తెలియడంతో ఇషాన్ లిఫ్ట్‌లో లేదా మెట్ల మీద నుంచి కింద‌కి వెళ్ల‌కుండా వెంటనే... బాల్క‌నీ గోడ మీదనుండి కింద‌కి దూకేశాడట. అచ్చం సినిమాల‌లో క‌నిపించే స్టంట్ ని ఇషాన్ చేశాడు. మరి అక్కడే ఉన్న మీడియా లో ఎవరో ఇషాన్ గోడ దూకుతున్నప్పటి ఫోటోని క్లిక్ మనిపించారు. ఇప్పుడా ఫోటో మీడియాలో, ఇంటర్నెట్ లో తెగ వైర‌ల్ అయిపోయింది.

Similar News