జవాన్ రెండు రాష్ట్రాల ఫస్ట్ డే కలెక్షన్స్

Update: 2017-12-02 12:10 GMT

సాయి ధరమ్ తేజ - మెహ్రీన్ కౌర్ జంటగా నటించిన జవాన్ చిత్రం నిన్న శుక్రవారమే విడుదలై మిశ్రమ స్పందనతో దూసుకుపోతుంది. వరుస ప్లాప్స్ తో సతమతమవుతున్న సాయి ధరమ్ తేజ్ కి ఈ సినిమా మిశ్రమ స్పందన కాస్త ఊరటనిచ్చింది. ఇక రెండు సినిమాల మీదకి పోటీకి దిగినా.. ఆ సినిమాలు కాస్త డల్ గా ఉండడంతో జవాన్ సినిమాకి కలిసొచ్చింది. అందుకే బాక్సాఫీసు వద్ద జవాన్ సినిమా నిలకడగా నిలబడగలిగింది. దర్శకుడు బి వి ఎస్ రవి కి కూడా ఈ సినిమా విజయం తో కాస్త కుదుటపడ్డాడు. ఎందుకంటే ఈ సినిమాప్లాప్ అయితే తనకి ఇక కెరీర్ ఉండదనే మాట ఓపెన్ గానే చెప్పేసాడు రవి. ఇకపోతే జవాన్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మొదటి రోజు మంచి కలెక్షన్స్ సాధించి సాయి ధరమ్ కెరీర్ లో బెస్ట్ అనిపించేలాగే కనబడుతుంది. ఇకపోతే జవాన్ మొదటి రోజు రెండు రాష్ట్రాల్లోనూ సాధించిన కలెక్షన్స్ మీ కోసం.

ఏరియాల వారీగా ఫస్ట్ డే కలెక్షన్స్ కోట్లలో..

నైజాం - 1 .05

సీడెడ్ - 0 .60

గుంటూరు - 0 .37

ఉత్తరాంధ్ర - 0 .35

తూర్పు గోదావరి - 0 .26

కృష్ణా - 0 .19

పశ్చిమ గోదావరి - 0 .16

నెల్లూరు - 0 .11

ఏపీ మరియు తెలంగాణ మొత్తం - 3 .09 కోట్లు

Similar News