పవన్ కళ్యాణ్ - బన్నీ ల మధ్య పరోక్ష వార్ నడుస్తుందని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. రోజు రోజుకి ఇది ముదురుతుంది. ఇది వాస్తవం. త్రివిక్రమ్ అజ్ఞాతవాసి సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లక ముందు చాలా రోజులు ఖాళీగానే ఉన్నాడు. బన్నీతో సినిమా చేయకుండా డైరక్టర్ త్రివిక్రమ్ కు పవనే అడ్డం పడ్డారనే గుసగుసలు అప్పట్లో గుప్పుమన్నాయి.
అయితే ఇప్పుడు పవన్ ఫాన్స్ అల్లు అర్జున్ ఫాన్స్ మరోసారి ప్రత్యక్ష యుద్దానికి దిగడానికి రెడీగా వున్నారు. అదేమిటంటే అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా స్పెషల్ టీజర్ జనవరి 1న రిలీజ్ అవుతుంది. అయితే అంతకన్నా ముందుగానే పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి ట్రయిలర్ రావాల్సి వుంది. క్రిస్మస్ కు వస్తుందని అనుకున్నారు. కానీ ఇంకా ఆ ఊసే లేదు.
అయితే అజ్ఞాతవాసి ట్రయిలర్ కూడా జనవరి 1న విడుదల అయ్యే అవకాశముందని చెబుతున్నారు. ఒక రోజు ఇటుకానీ అటు కానీ కావచ్చు. అంటే దాదాపు బన్నీ సినిమా టీజర్ టైమ్ కు అటు ఇటుగా అన్నమాట. ఇలా జరిగితే ఫాన్స్ మధ్య ఇంకా వైరం పెరిగే అవకాశంవుంది. పైగా యూ ట్యూబ్ లైక్ లు, వ్యూస్ పై లెక్కలలో తేడా వచ్చే అవకాశంవుంది. ఒకవేళ పవన్ ట్రయిలర్ విడుదల కాకపోయినా పవన్ అజ్ఞాతవాసిలో గొంతు సవరించుకుని పడిన పాటను డిసెంబర్ 31 న విడుదలవుతుంది. మరి మరోమారు పవన్ ఫాన్స్, అల్లు అర్జున్ ఫాన్స్ సోషల్ మీడియాలో కొట్టుకోవడాయికి రెడీగా వున్నారన్నమాట వినబడుతుంది.