వారానికి రెండు మూడు సినిమాలతో దాదాపుగా గత నాలుగైదు నెలలుగాబాక్సాఫీసు కళకళలాడుతుంది. సినిమా ఫలితాలు ఎలాఉన్నా రెండు మూడు సినిమాలు మాత్రం బాక్సాఫీసుని డదడలాడిస్తున్నాయి. అయితే నిన్న శుక్రవారం నాని అ! సినిమా, సుందీప్ కిషన్ మనసుకునచ్చింది వచ్చాయి. కానీ వచ్చే వారం ఓ... అనుకునేంత సినిమాలేవీ బాక్సాఫీసు వద్దకు రావడం లేదు. మరి అలాంటి టైం లో మీడియం బడ్జెట్ ఉన్న హీరో సినిమాతో వస్తే.. కాస్త టాక్ బావున్నా చాలు సినిమాకి మంచి కలెక్షన్స్ వస్తాయి. కానీ రిలీజ్ డేట్ ఇచ్చిమరీ ఒక హీరో ఫిబ్రవరి 23 నుండి తప్పుకున్నాడు.
ఆహీరో ఎవరో కాదు ఛలో తో హిట్ కొట్టిన నాగశౌర్య. మరి ఛలో హిట్ ని అతను నటించిన తమిళ మూవీ కణం కోసం వాడుదామనుకున్నాడు. అసలు ఛలో సినిమా, కణం సినిమా ఫిబ్రవరిలోనే రావాల్సి ఉంది. కానీ ఛలో సైలెంట్ గా వచ్చి హిట్ కొట్టేస్తే.. కణం మాత్రం ఫిబ్రవరి తొమ్మిది నుండి ఫిబ్రవరి 23 కి షిఫ్ట్ అయ్యిది. మరి ఇప్పుడు ఫిబ్రవరి 23 న కూడా కణం వాయిదా పడింది అంటున్నారు. తమిళనాట విజయ్ డైరెక్టర్ గా, కోలీవుడ్ బడా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ లో ఫిదా, ఎంసీఏ సినిమాల్తో సూపర్ ఫామ్ లో ఉన్న సాయి పల్లవి తో జోడి కట్టాడు నాగశౌర్య. మరి మంచి కాంబోలో తెరకెక్కిన ఈసినిమాకి విడుదల కష్టాలు తప్పడం లేదు.
ఇప్పటికే నాగశౌర్య చలో సినిమా హిట్ ని చూపించి కణం సినిమాకి బిజినెస్ చేసారనే ప్రచారం ఉంది. మరి ఛలో హిట్ తో జోష్ మీదున్న నాగశౌర్య, ఫిదా, ఎంసీఏ సినిమా ల హిట్ తో ఉన్న సాయి పల్లవి లు కలిసి కణం సినిమాని ప్రమోట్ చేసుకుని విడుదల చేసుకునేదానికి... ఇలా విడుదల వాయిదాల మీద వాయిదాలు పడుతూ సినిమా మీద ఇంప్రెషన్ పోగొట్టుకోవడం ఎందుకు అంటున్నారు జనాలు. మరి కణం ఫిబ్రవరి 23 నుండి పోస్ట్ పోన్ అయ్యి మళ్ళి విడుదల తేదీ ఎప్పుడు ప్రకటించుకుంటుందో అంటున్నారు.