నాగ చైతన్య ప్రస్తుతం ఒక రేంజ్ లో దూసుకుపోతున్నాడు. అయితే నాగ చైతన్య కి ఈ ఏడాది శుభమే జరిగింది. కోరుకున్న అమ్మాయితో పెళ్లి... రారండోయ్ వేడుక చూద్దాం అంటూ ఒక హిట్ ని అలాగే యుద్ధం శరణం అంటూ ఒక ఫ్లాప్ ని తన ఖాతా లో వేసుకున్నాడు నాగ చైతన్య. అయితే ఈ రెండు సినిమాల తరువాత సమంతా ని పెళ్లి చేసుకున్న నాగ చైతన్య.... చందు మొండేటి దర్శకత్వంలో సవ్యసాచితో పాటే... మారుతీ దర్శకత్వంలో మరో సినిమా ని ఓకే చేసాడు. చందు దర్శకత్వంలో సవ్యసాచి షూటింగ్ తోపాటు... మారుతీ దర్శకత్వంలోని సినిమాని కూడా నాగ చైతన్య ఒకేసారి పూర్తి చేయాలనుకుంటున్నాడు.
మారుతీ - నాగ చైతన్య సినిమా తాజాగా పూజ కార్యక్రమాలతో మొదలైంది. ఈ సినిమా లో చైతు సరసన అను ఇమ్మాన్యుయల్ హీరోయిన్ గా నటిస్తుంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతున్న ఈ సినిమా లో నాగ చైతన్య ఫుల్ ఇగో ఉండే వ్యక్తిగా నటించబోతున్నాడు అని తెలుస్తుంది. మరి నాగ చైతన్య ఇంతకూ ముందు 100 % లో కూడా కాస్త ఈగో ఉన్న వ్యక్తిగా నటించి మెప్పించాడు. మరి ఇప్పుడు మారుతి దర్శకత్వంలో నటించి మెప్పించడానికి సన్నద్ధమై వున్నాడు.
ఇకపోతే మారుతీ - నాగ చైతన్య కలయికలో వస్తున్నా ఈ సినిమాకి శైలజ రెడ్డి అల్లుడు అనే టైటిల్ రిజిస్టర్ చేసారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ ని సితార ఎంటర్ టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమాతో పాటే.. చందు సవ్యసాచి... తో నాగ చైతన్య వచ్చే ఏడాది బాక్స్ ఆఫీస్ దగ్గర బాగానే సందడి చేస్తాడు అనిపిస్తుంది.