చెర్రీ - ఎన్టీఆర్ ల సినిమా జానర్ ఏంటో తెలుసా!

Update: 2017-12-10 10:54 GMT

ఈ ఏడాది సినీ అభిమానులకు ఏమైనా పెద్ద గుడ్ న్యూస్ ఉందంటే అది రాజమౌళి... ఎన్టీఆర్, రామ్ చరణ్ కలయికలో వస్తున్న మల్టీస్టారర్ చిత్రానికి సంబందించిన న్యూసే. ఈ చిత్రం పై అభిమానులు, ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. సినిమా గురించి అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా ఈ సినిమాపై అనేక రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అందులో ఒకటి ఈ సినిమా జానర్ ఏమిటి అనే ప్రశ్న. ఇది పూర్తిగా భావోద్వేగాలతో కూడిన కుటుంబ కథా చిత్రంగా ఉంటుందని తెలుస్తోంది. ఇన్నాళ్లు యాక్షన్, ఫాంటసీ జానర్లలో సినిమాలు తీసిన రాజమౌళి మొదటిసారి ఒక ఫ్యామిలీ చిత్రాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి.

పైగా ఈ సినిమా కథ ఒక వాస్తవ కుటుంబం నుండి స్ఫూర్తి పొంది తయారుచేసుకుంటున్నారట. ఆ కుటుంబం ఎవరిదో తెలియాలన్నా ఇంకొన్నాళ్ళు ఎదురుచూడాల్సిందే. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో స్టార్ట్ చేసి 2019 సమ్మర్ లో రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారు. ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు స్టోరీ అందించనున్నారు.

Similar News