చెర్రీ అన్నఎవరో తెలుసా?

Update: 2018-01-20 14:00 GMT

రామ్ చరణ్, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగస్థలం విడుదల కాకమునుపే బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక మాస్ ఎంటెర్టైనెర్ కి శ్రీకారం చుట్టాడు. బోయపాటి డైరెక్షన్ లో సినిమా మొదలవ్వడమే కాదు అధికారికంగా సెట్స్ మీదకెళ్ళి రెగ్యులర్ షూటింగ్ ని కూడా మొదలెట్టేసింది. రంగస్థలం వంటి ఒక విభిన్న కథ తర్వాత చేస్తున్న ఈ సినిమా పక్కా మాస్ గా ఉండబోతుంది. ఇక ఈ సినిమాని డి వి వి దానయ్య నిర్మిస్తుండగా మహేష్ తో భరత్ అనే నేను సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కైరా అద్వానీ చరణ్ కి హీరోయిన్ గా నటిస్తుంది.

అయితే ఇప్పుడు బోయపాటి - రామ్ చరణ్ సినిమాకి సంబందించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది. అదేమిటంటే ఈ సినిమాలో చెర్రీ కి అన్నగా ఒక తమిళ సీనియర్ హీరో నటిస్తున్నాడు. ఆ హీరో ఎవరో కాదు జీన్స్ చిత్రంతో అమ్మాయిల మదులు దోచేసిన ప్రశాంత్. ఈ సినిమాలో రామ్ చరణ్ అన్నయ్యగా ప్రశాంత్ నటిస్తున్నాడని న్యూస్ సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది. మరి బోయపాటి మార్క్ తో ఈ మాస్ ఎంటెర్టైనెర్ లో రామ్ చరణ్ అన్న ప్రశాంత్ తో కలిసి ఎలాంటి బీభత్సాలు సృష్టిస్తాడో చూద్దాం.

Similar News