చెప్పకనే చెప్పేశాడా?

Update: 2018-03-09 09:01 GMT

సౌత్ లో టాప్ హీరోయిన్ ఎవరు అనగానే వెంటనే నయనతార అని చెప్పేస్తారు. ఇండస్ట్రీకొచ్చి చాలా రోజులయినప్పటికీ... ఇప్పటికి టాప్ రేంజ్ లోనే ఉంది నయనతార. అటు స్టార్ హీరోలు, ఇటు యంగ్ హీరోలతో కలిసి దున్నేస్తూనే మరోపక్క లేడి ఒరింటెడ్ చిత్రాలతో అదరగొడుతుంది. సౌత్ హీరోయిన్స్ అందరిలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ కూడా నయనతారే కావడం గమనార్హం. అయితే ఇప్పటివరకు పర్సనల్ లైఫ్ లో రెండు మూడు లవ్ ఎఫ్ఐర్స్ తో దెబ్బతిన్న నయనతార ఇప్పుడు మరో లవ్ ఎఫ్ఫైర్ తో నిత్యం వార్తల్లోనే ఉంటుంది. తమిళ డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో ప్రేమాయణం నడుపుతున్న నయన్ పెళ్లి విషయంలో మాత్రం ఆచి తూచి అడుగువేస్తుంది. కానీ ఓపెన్ అవడం లేదు.

అయితే విగ్నేష్, నయనతార లు ఎప్పటికపుడు ప్రేమ పక్షుల్లా విదేశాల్లో, స్వదేశంలోని విహరిస్తూ బహిరంగంగానే తిరుగుతున్నారు. కానీ ఇద్దరూ తమ మధ్యన ప్రేమ ఉందని గాని, త్వరలోనే తమ పెళ్లి అని గాని ఎక్కడా బయటపడడం లేదు. కానీ తాజాగా విగ్నేష్ చేసిన ఒక పోస్ట్ మాత్రం తమ మధ్యన ప్రేమ ఉన్న సంగతి చెప్పకనే చెప్పేసాడు. మార్చ్ 8 ఉమెన్స్ డే సందర్భంగా దర్శకుడు విఘ్నేష్ ఒక పోస్టు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. మరి అది చూసిన ఎవరైనా విగ్నేష్ కి నయన్ కి మధ్యలో లవ్ లేదని ఎలా చెబుతారు.

ఆ పోస్ట్ ఏమిటంటే... మన జీవితాన్ని సంపూర్ణం చేసినవారికి.. ప్రేమంటే ఏమిటో చూపినవారికి.. మన బతుకుల అర్ధం చెప్పిన వారికి.. ఎలాంటి షరతుల్లేకుండా మనల్ని ప్రేమించి ఈ ప్రపంచాన్ని అందంగా మార్చిన అమ్మలు... సోదరీమణులు.. ప్రియమైన వాళ్లకు హ్యాపీ ఉమెన్స్ డే విషెస్ చెబుతూ.. తన తల్లితోపాటు చెల్లెలి ఉన్న ఫోటో ని అలాగే ఆ పిక్ తోపాటు... తన లవర్ నయనతార ఫోటోని కలిపి షేర్ చేసాడు. మరి తన తల్లిని చెల్లిని ఎంతగా ప్రేమిస్తున్నాడో.. నయనతారని అంతే ప్రేమిస్తున్నాని విగ్నేష్ శివన్ చెప్పకనే చెప్పేసాడు కదా....!

Similar News