చిరంజీవి 151 వ చిత్రం సై రా నరసింహారెడ్డి మరో రెండు రోజుల్లోనే సెట్స్ మీదకెళ్లబోతుంది. సై రా చిత్రం రెగ్యులర్ షూటింగ్ కి కౌంట్ డౌన్ మొదలయ్యింది. ఇక మీడియాలో, వెబ్ మీడియాలో, ప్రింట్ మీడియాలోనూ సై రా గురించిన టాపిక్ మాత్రమే వినబడుతుంది కనబడుతుంది. ఇక ఫిలింసర్కిల్స్ లోను సై రా గురించిన చర్చలే నడుస్తున్నాయి. ఇకపోతే సై రా నరసింహారెడ్డి గా చిరంజీవి లుక్ అదరగొడుతుంది. చిరు సై రా లుక్ అందరిని ఆకట్టుకుంటుంది. ఎప్పటినుండో ఉయ్యాలవాడ సినిమా కోసం మేకోవర్ అవుతున్న చిరు ఇప్పుడు పర్ఫెక్ట్ గా సై రా నరసింహారెడ్డి లుక్ లో దర్శనమిస్తున్నాడు.
సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి లైఫ్ స్టోరీ కావడంతో కంప్లీట్ పోరాటయోధుడిగా కనిపిస్తున్నాడు చిరంజీవి. ఇందుకోసం భారీగా గెడ్డం కూడా పెంచేశాడు. అందుకు సంబంధించిన ఓ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ లుక్ ని చూసిన మెగా ఫాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చిరంజీవి లుక్ మొత్తం అచ్చం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మాదిరిగానే ఉందంటున్నారు. అలాగే ఫిట్నెస్ కోసం రామ్ చరణ్ తో పాటు చిరు కూడా జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్నాడు.
ఇప్పటికే ప్రి ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకుని అటు డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఇటు రామ్ చరణ్ లు ఎదురు చూస్తున్నారు. ఇక సినిమా డిసెంబర్ 6 న సెట్స్ మీదకెళ్ళేటప్పటికీ అన్ని రెడీ అయ్యాయి. ఇకపోతే హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో వేసిన ఒక సెట్ లో సినిమా మొదటి షూట్ స్టార్ కానుంది. నిర్మాత రామ్ చరణ్ దర్శకుడు సురేందర్ రెడ్డి అందుకు ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారట.