చిరు కి నచ్చలేదా?

Update: 2017-12-15 17:54 GMT

రామ్ చరణ్ - సుకుమార్ కలయికలో తెరకెక్కుతున్న రంగస్థలం షూటింగ్ కంప్లీట్ అయినప్పటికీ ఇంకా పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉంది. సుకుమార్ స్టయిల్ కి భిన్నం గా తెరకెక్కుతున్న ఈ సినిమా మొత్తం 1985 నాటి అచ్చమైన పల్లెటూరి వాతావరణం కథ తో తెరకెక్కుతున్నది. అలనాటి వాతావరణం అంటే.. అప్పట్లో ఆధునికతకు చొట్టెక్కడుంది. అంటే సెల్ ఫోన్స్, మోడరన్ బైక్స్, మోడరన్ కార్స్ ఇలా ఆధునిక అనే మాటకే చోటు లేదు. అలాగే దుస్తుల విషయంలోనూ మోడరన్ అనే మాటకు చోటే లేదు. ఇప్పట్లోలాగా జీన్స్ , అమ్మాయిలకు అల్ట్రా మోడరన్ డ్రెస్సులు ఇలాంటివాటికి అర్ధమే తెలియదు.

అందునా పట్టన ప్రాంతం వారికీ ఉన్న అవగాహనా పల్లెటూరు వాళ్లకి అస్సలుండదు. మరి అలాంటి పల్లెటూరి నేపధ్యం ఉన్న కథతో దర్శకుడు సుకుమార్... రామ్ చరణ్, సమంత తో కొత్తగా ట్రై చేస్తున్నాడు. అందునా తాజాగా విడుదలైన రంగస్థలం లుక్ లో రామ్ చరణ్ ఎంత డి గ్లామరస్ గా ఉన్నాడో.. అలాగే లీకైన సమంత పిక్స్ లోను సమంత కూడా ఎంత డి గ్లామర్ గా ఉందొ అనే విషయం అర్ధమయ్యింది. అలాగే ఈ సినిమాలో రామ్ చరణ్ వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా నటిస్తున్నాడని టాక్ ఉంది. కాకపోతే ఏ ఈసినిమాలో గ్లామర్ కన్నా నటనకు ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది.

అయితే ఇప్పుడు తాజాగా చిరంజీవి రంగస్థలం రషెస్ చూసి అసంతృప్తి వ్యక్తం చేశారనే వార్త ఫిలింసర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. రషేష్ తో పాటు ఫస్ట్ లుక్ ని జాగ్రత్త గా పరిశీలించిన చిరంజీవి మూవీ లో రామ్ చరణ్ చాలా డీగ్లామర్ గా ఉన్నాడు అని అలాగే మూవీ లో డీగ్లామర్ అంశాలు ఎక్కువయ్యాయి అని చెప్పాడనే టాక్ బయటికొచ్చింది. ఈ సీన్స్ ఎక్కువగా కనిపిస్తే ఫాన్స్ కి అస్సలు నచ్చదు అని సో అందుకే డీగ్లామర్ అనే ఎలిమెంట్ ని కాస్త తగ్గించి మళ్ళీ రీ-షూట్ జరపమని చిరంజీవి అన్నాడు అని తెలుస్తుంది. ఇప్పటికే కొన్ని సీన్స్ ని రీ-షూట్ జరుపుకున్న ఈ సినిమా ని మళ్ళి రీ-షూట్ చేయడమంటే అది సవాల్ తో కూడుకున్న పని అని సుకుమార్ భావిస్తున్నాడట. మరి రీ-షూట్ చెయ్యకుండా చిరంజీవి ఇచ్చిన సలహా ని సుకుమార్ ఎలా కవర్ చేస్తాడో అనేదే ఇప్పుడు సంచలనంగా మారింది.

Similar News