మెగా కాంపౌండ్ నుండి ఇప్పటికే అరడజన్ పైగా వారుసులు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. వచ్చిన ఒక్కొక్కరూ ఒక్కో రూట్ ఎంచుకుని తమ కెరీర్ ను గాడిలో పెట్టుకుంటున్నారు. అయితే మెగా స్టార్ ఫామిలీ నుండి చిరంజీవి చిన్నల్లుడు ఇండస్ట్రీ లోకి అడుగు పెడుతున్న విషయం ఎప్పటినుండో ప్రచారంలో ఉంది.
ఇతను మెగా స్టార్ చిన్న కూతురు శ్రీజ భర్త అయిన కళ్యాణ్ కానుగంటి. గత కొన్ని నెలల నుండి ఇతను టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని చాలా వార్తలు వచ్చాయి. కానీ ఏ దర్శకుడు ఇతన్ని డైరెక్ట్ చేస్తాడో, ప్రొడ్యూస్ ఎవరు చేస్తారో తెలియలేదు. అయితే లేటెస్ట్ గా వచ్చిన సమాచారం ప్రకారం జత కలిసే చిత్రాన్ని రూపొందించిన రాకేష్ శశి.. కళ్యాణ్ తొలి చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే స్టోరీ కూడా రెడీ అయిందంట. ఈ టీంకు కళ్యాణ్ బావగారు.. చిరు కొడుకు రామ్ చరణ్ గైడెన్స్ ఇస్తున్నాడని తెలుస్తోంది. అరంగేట్ర చిత్రం కోసం ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో.. కళ్యాణ్ కు బాగా డీటైల్డ్ గా వివరిస్తున్నాడట మెగా పవర్ స్టార్.
ఈ సినిమా కోసం కళ్యాణ్ తన మేకోవర్ కూడా మార్చుకున్నాడు. అంతా రెడీ గానే వుంది చిరంజీవి ఒకే చెబితే చాలు ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కే అవకాశముంది. ఈగ లాంటి సినిమాను అందించిన సాయి కొర్రపాటి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయనున్నాడు.