చిరు ఎంత ఫాస్ట్ గా కానిచ్చేస్తున్నాడు

Update: 2017-12-25 14:00 GMT

చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో... రామ్ చరణ్ నిర్మాతగా ఉయ్యాలవాడ జీవిత చరిత్రతో సై రా నరసింహారెడ్డి చిత్రం తెరకెక్కుతుంది. తాజాగా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసుకున్న సై రా నరసింహరెడ్డి షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. సై రా టీం లో ఎన్నో మార్పులు చేర్పుల తరువాత డిసెంబర్ 6 న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యింది. అయితే ప్రస్తుతం ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యిందట. ఈ షెడ్యూల్ లో చిరంజీవి ఇంకా ఇతర కాస్టింగ్ మీద భారీ యాక్షన్ సీన్స్ తెరకెక్కించారట చిత్ర బృందం.

ఇకపోతే సై రా లో చిరంజీవి పాత్ర తాలూకు కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ ని కూడా షూట్ చేసారు అని తెలుస్తుంది. చిరంజీవి ఏంటో ఉత్సాహంగా సై రా షూటింగ్ లో పాల్గొంటున్నట్టుగా తెలుస్తుంది. అలాగే షూటింగ్ మొదలైనప్పటినుండి... షూటింగ్ కి గ్యాప్ రాకుండా చిరు పొద్దు పొద్దున్నే సెట్స్ కెళ్ళిపోతున్నాడట. ఇకపోతే కెమెరా మ్యాన్ రవి వర్మన్ ఈ మూవీ నుంచి వెళ్ళిపోయాక సినిమాటోగ్రాఫర్ గా రత్నవేలు ఈ టీం తో జాయిన్ అయ్యి ఫస్ట్ షెడ్యూల్ ని గ్రాండ్ గా సూపర్బ్ విజువల్స్ తో ఫినిష్ చేసాడట.

ఇక ఈ సినిమాలో చిరంజీవి తో పాటు అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, నయనతార ఇంకా జగపతి బాబు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి ఈ మూవీ కి మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించే ఛాన్స్ ఉంది అని ఫిలిం నగర్ టాక్.

Similar News