చిరంజీవిని పెద్దనాన్న అని ఊరికే అనలేదు

Update: 2017-12-29 06:04 GMT

తన వదిన సమంత అంటే చాలా స్పెషల్ అని అఖిల్ అక్కినేని.... నిన్న జరిగిన ఇంటర్వ్యూ లో హలో సినిమాలోని తన పాత్ర గురించి.. సినిమాకి వచ్చిన కామెంట్స్ గురించి చెప్పాడు. ఈ సినిమాలో నిజమైన అఖిల్ ని చూపించినందుకు విక్రమ్ కు థాంక్స్ అని చెప్పిన సమంత మాటలుపై స్పందిస్తూ..హలో విడుదల తర్వాత నేను వదినను కలవలేదు. ఆమె ముంబై, చెన్నై లో బిజీగా తిరుగుతుంది.

అయితే న్యూ ఇయర్ కి మాత్రం నేను వదినతో సెలెబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నా. న్యూ ఇయర్ పార్టీ కి కూడా నన్ను ఇన్వైట్ చేసింది. ఆమె నా కోసం ఏం ప్లాన్ చేసిందో ఇంకా తెలీదు అన్నాడు. ఇక హలో సినిమా విషయం లో చిరంజీవి గారు, చరణ్ చూపించిన ప్రేమ నేను ఎప్పటికి మర్చిపోను అన్నాడు. చిరంజీవిని తాను పెద్దనాన్న అని ఊరికే అనేయలేదని.. ఆయన.. ఆయన కుటుంబం తన మీద ఎప్పుడూ అంత ప్రేమ చూపిస్తోందని అఖిల్ అన్నాడు.

ఇక హలో సినిమా రోజు నేను నైట్ అంత పడుకోలేదని..తెల్లవారుజామున యుఎస్ నుంచి ఫోన్ చేసి సినిమా బాగుందని ఆడియన్స్ చెప్పాక ప్రశాంతంగా పడుకున్నానని అతనన్నాడు. ఈ సినిమా గురించి మీకు వచ్చిన బెస్ట్ కంప్లిమెంట్ ఏంటి అని అడగగా.. ఒక్క అమ్మాయి ఈ సినిమా క్లైమాక్స్ గురించి గొప్పగా చెప్పిందని.. ఆమె మనసు దోచేశానని అందని.. అదే తనకు బెస్ట్ కాంప్లిమెంట్ అని అన్నాడు.

Similar News