చిన్న సినిమాలపై సోషల్ మీడియా ప్రభావం

Update: 2017-12-30 15:00 GMT

ఈమధ్య టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ ఒకటి మొదలయింది. సోషల్ మీడియాలో ఆహా.. ఓహో అన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అంతంత మాత్రంగానే వసూళ్లు రాబడుతున్నాయి. టాక్ బాగున్నప్పుడు వసూల్ కూడా అదే విధంగా ఉండాలి కానీ ఈ ధోరణి చూస్తే మాత్రం చాలా విచిత్రంగా అనిపించక మానదు.

ఉదాహరణకు మెంటల్ మదిలో లాంటి సినిమా సోషల్ మీడియాలో రివ్యూ మెజారిటీ 3 పైగా వచ్చాయి. కానీ సినిమా అతి కష్టం మీద పది కోట్ల మార్క్ దాటి ఆగిపోయింది. పెట్టిన పెట్టుబడి తక్కువే కాబట్టి ప్రాఫిటబుల్ వెంచర్ గానే చూసుకోవాలి.

ఇక అఖిల్ హలో విషయానికి వస్తే యూనివర్సల్ హిట్ పేరుతో వెబ్ సైట్స్ ఇచ్చిన రేటింగ్స్ అన్ని.... పెద్ద లిస్టు రూపంలో పోస్టర్ మీదే ప్రింట్ చేసి పబ్లిసిటీ చేసారు. తీరా చుస్తే 15 కోట్లు షేర్ మాత్రమే చేసింది. ఇంకా 15 కోట్లు చేస్తేగాని సినిమా గట్టెక్కలేదు .ప్రస్తుత పరిస్థితుల్లో అది అసాధ్యం అని చెప్పక తప్పదు. పెళ్లి చూపులు కేవలం టాక్ తోనే 25 కోట్లు దాటింది. అలానే అర్జున్ రెడ్డి కూడా 40 పైగా లాగాడు. సోషల్ మీడియాలో ఎంత ప్రమోట్ చేసుకున్నా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం భిన్నమైన ఫలితాన్ని చూస్తున్న కొన్ని సినిమాలను చూస్తుంటే కంటెంట్ బలంగా ఉంటే తప్ప కాసులు రాబట్టడం కష్టమని అర్థమైపోతుంది.

Similar News