స్టార్ కమెడియన్ నుండి హీరో అయ్యి వరస హిట్స్ అందుకున్నాడు. కానీ ఆ విజయాల తర్వాత వాటిని నిలబెట్టుకోలేకపోయాడు. తన ఇమేజ్‌కు సూటవ్వని సినిమాలు చేసి ట్రాక్ తప్పాడు. వరుసగా అరడజనుకు పైగా ఫ్లాపులు తిన్నాడు.
ఉంగరాల రాంబాబు ఈ ఏడాది వచ్చిన చెత్త సినిమాలలో ఒకటి. బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. ఇక నిన్న రిలీజ్ అయిన ‘2 కంట్రీస్’ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు సునీల్. కానీ అది కూడా ప్లాప్ టాక్ వచ్చేసింది. ఆల్రెడీ సునీల్ తో కమిట్మెంట్ వున్న సినిమాలు..ఉంగరాల రాంబాబు వల్ల అవి వెనక్కి వెళ్లిపోయాయి. సరే.... అనుకొని ‘2 కంట్రీస్’ రిలీజ్ కోసం వెయిట్ చేసాడు. అది కూడా డిజాస్టర్ అవ్వడంతో సునీల్ పరిస్థితి గందరగోళంగా మారింది.
తాను హీరోగా మూడు కమిట్మెంట్లు ఇచ్చినట్లు.. ఆ మూడు సినిమాలూ వచ్చే ఏడాదే మొదలవుతాయన్నట్లుగా మాట్లాడాడు సునీల్. కానీ ‘2 కంట్రీస్’ ఆడితేనే వాటిపై ఆశలుంటాయి. కానీ ఈ సినిమా టాక్ తరువాత పరిస్థితి చూస్తుంటే వాటిలో ఒక్కటి కూడా ముందుకు కదలకపోవచ్చు. మరి ఇప్పటి నుండి సునీల్ తన కెరియర్ ఎలా డిజైన్ చేస్తున్నాడో అని అందరిలోను ఓ క్యూరియాసిటీ ఉంది.