కొంత మంది హీరోయిన్స్ పెళ్లి అయిన తర్వాత వాళ్లలో చాలా మార్పు వస్తుంది. పెళ్లి అయిన తర్వాత సినిమాలు తగ్గించడం లేదా పర్సనల్ లైఫ్ లో మార్పులు రావడం ఇలాంటివి వస్తుంటాయి. కానీ సమంత మాత్రం అస్సలు మారలేదట. తన వ్యక్తిగత స్వేచ్చలో ఏ మాత్రం తేడా రాలేదు అంటోంది.
రీసెంట్ గా పెళ్లి చేసుకున్న సామ్ తన లైఫ్ స్టైల్ లో ఏం మార్పు లేదని ఇదివరకు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలానే వున్నాను అని చెబుతుంది. కాకపోతే పెళ్లి తర్వాత ఓ మార్పు వచ్చింది తనకు చాదస్తం మరి ఎక్కువైపోయిందని అంటోంది. అప్పట్లో సినిమా కథ ఎంచుకుంటే అది బాగోలేదు... ఇది బాగోలేదు అనేదాన్ని. అయితే ఇప్పుడు అది మరీ ఎక్కువ అయింది అని చెబుతుంది సమంత.
ప్రతి సినిమాలో ఇప్పుడు లోపాలను వెతకాల్సి వస్తోందని చెబుతూ.. చాలా వరకు కథలకు నో చెబుతున్నా అంటోంది. కథల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. కథ ఏ మాత్రం నచ్చకపోయినా నో చెబుతున్నాని చెబుతుంది. తాను చేసే సినిమాలో తన పాత్రకు ప్రత్యేక స్థానం ఉంటేనే ఓకె అంటున్నా అని అంటుంది. ప్రస్తుతం రంగస్థలం సినిమా షూటింగ్ తో చాలా బిజీగా ఉంది. ఆ సినిమాలో సమంత పాత్ర చాలా కొత్తగా ఉండనుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.