లేటెస్ట్ గా రిలీజ్ అయిన ‘ఎంత చక్కంగున్నావె’ సింగల్ రంగస్థలం సినిమాపై మరింత హైప్ ని క్రియేట్ చేస్తుంది. మరోసారి సినిమాపై భారీ అంచనాలు పెంచేందుకు రంగస్థలం టీం ఇంకో సింగల్ ను రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారంట. అయితే ఈసారి డబల్ బొనాంజా ఇవ్వనున్నాడు చరణ్ తన ఫ్యాన్స్ కి.
సెకండ్ సింగల్ తో పాటు రెండు నిమిషాల విజువల్స్ రిలీజ్ చేద్దాం అని చరణ్ ప్లాన్ చేస్తున్నాడట. అయితే ఫస్ట్ సింగల్ రిలీజ్ అప్పుడే ఈ విజువల్స్ విడుదల చేయాల్సివుంది కానీ లాస్ట్ మినిట్ లో సిజి, డిఐ, మిక్సింగ్ ఇలా అన్నీ మళ్లీ చేయాలి అంటే టైమ్ పట్టేస్తుంది. అందుకే డైరెక్టర్ సుకుమార్ చరణ్ కు నెక్స్ట్ సాంగ్ అప్పుడు రిలీజ్ చేద్దాం అని నచ్చచెప్పాడంటా.
రంగా.. రంగస్థలాన పాటతో పాటే మిక్స్ చేసి ఈ వీడియో వదులుతారో? లేదా ఆ ఆడియో వేరుగా, ఈ వీడియో వేరుగా వదులుతారో చూడాలి. మరి ఈ టైటిల్ సాంగ్ లో 1985 నాటి విజువల్స్ ఎలా రీ ప్రొడ్యూస్ చేసారో చూడాలి. ఏదిఏమైనా మరో రెండు మూడు రోజుల్లో ఈ కానుక ఆన్ లైన్ లోకి విడుదల అవుతుంది.