బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా అనగానే .. అవునా... మరి ఈ విషయాన్నీ రామ్ చరణ్ ఎక్కడా కన్ఫర్మ్ చెయ్యలేదు అన్నారు. కానీ అనూహ్యంగా బోయపాటి - రామ్ చరణ్ సినిమా ఆఫీసియల్ గా మొదలైపోయింది. మొదటిసారి మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్నాడు రామ్ చరణ్. రంగస్థలం షూటింగ్ కంప్లీట్ కాగానే బోయపాటి మూవీకి షిఫ్ట్ అవుతాడట చరణ్. అయితే బోయపాటి - చరణ్ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. అల్లు అర్జున్ తో బోయపాటి తెరకెక్కించిన సరైనోడు సినిమా మాదిరిగా చెర్రీ సినిమా కూడా యాక్షన్ ఎంటెర్టైనెర్ గా ఉండబోతుందట.
ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా వున్న బోయపాటి మరోపక్క నటీనటుల ఎంపిక చేపట్టినట్లుగా తెలుస్తుంది. ఇకపోతే బోయపాటి - రామ్ చరణ్ సినిమాలో ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ ని పక్కనపడేసి ఎవరైనా ఒక కొత్త హీరోయిన్ ని తేవాలని బోయపాటి భావిస్తున్నాడట. అయితే కొత్త హీరోయిన్ ని తీసుకుంటే... బడ్జెట్ కూడా తక్కువ వుంటుంది అని కూడా భావిస్తున్నారట. కానీ మెగా ఫ్యామిలీ మాత్రం చరణ్ పక్కన మరోమారు రకుల్ ప్రీత్ సింగ్ కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందనే భావనలో ఉందట. మరి ప్రస్తుతానికి హీరోయిన్ కోసం వేటలో ఉన్న ఈ సినిమా చిత్ర బృందం ఇందులో నటించే విలన్ సెర్చింగ్ లో కూడా ఉన్నారట.
ఇకపోతే డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ సినిమా 2018 జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశముంది. ప్రస్తుతం చెర్రీ నటిస్తున్న ‘రంగస్థలం’ 2018 మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.