చరణ్ కోసం రంగంలోకి అజయ్!!

Update: 2017-07-22 06:00 GMT

బాలీవుడ్ లో తెలుగు సినిమాలకు గిరాకీ పెరిగింది. అది కూడా బాహుబలి ఘన విజయంతో ఇప్పుడు బాలీవుడ్ ప్రోడుసర్స్ తెలుగు సినిమా హక్కులు పొందడానికి క్యూ కడుతున్నారు. ఇంతకుముందు కూడా తెలుగు సినిమా హక్కులను కొనుకునేవారు. కానీ పెద్దగా వాటికి క్రేజ్ ఉండేది కాదు. కానీ బాహుబలి పుణ్యమా అని ఇప్పుడు టాలీవుడ్ సినిమాలకు బాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ తోపాటు భారీ డిమాండ్ ఏర్పడింది. అయితే అక్కడ బాలీవుడ్ జనాలు మాత్రం తెలుగు సినిమాలను థియేటర్స్ లో చూడడానికి ఆసక్తి చూపరు గాని బుల్లితెర మీద వస్తే మాత్రం వదలరు. తెలుగు నుండి బాలీవుడ్ లోకి డబ్ అయినా సినిమాలకు అక్కడ ఛానల్స్ లో భలే గిరాకీ.

అందుకే మన సినిమాలను హిందీలోకి డబ్ చేసి హిందీ ఛానల్స్ లో ప్రసారం చేసి క్యాష్ చేసుకుంటున్నారు అక్కడివారు. ఈ మధ్యనే అల్లు అర్జున్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ అయిన సరైనోడు చిత్రం అక్కడ హిందీలో డబ్ చేసుకుని ఒక ప్రముఖ ఛానల్ లో ప్రచారం అయ్యి ఎంత క్రేజ్ సంపాదించిందో తెలిసిన విషయమే. అందుకే ఇప్పుడు రామ్ చరణ్ చిత్రం ధ్రువ కూడా హిందీలో డబ్ చేసుకుని ఒక ప్రముఖ ఛానల్ లో ప్రసారం కానుంది. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్రకు.. హిందీ డబ్బింగ్ చెప్పమని బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ని ఆ ఛానల్ నిర్వాహకులు కోరగా అందుకు వెంటనే అజయ్ ఒప్పుకుని ఆ డబ్బింగ్ కార్యక్రమం పూర్తి చేసాడట. దీంతో.. ధ్రువ చిత్రానికి ఉన్నట్టుండి హైప్ పెరిగిపోయింది.

అయితే చరణ్ ధ్రువ చిత్రానికి అజయ్ అడగ్గానే డబ్బింగ్ చెప్పడానికి కారణం మాత్రం అజయ్ దేవగన్ సినిమాలను ఆ ఛానల్ వారే కొనుక్కోవడం... ఆ ఛానల్ వలన అజయ్ సినిమాలుకు మంచి డిమాండ్ ఉండడంతో వెంటనే ఒప్పేసుకున్నాడని అంటున్నారు. ఇక ఇప్పటివరకు నన్ను నేను స్క్రీన్ మీద చూసుకున్నా.... మొదటిసారి నా గొంతు మరొకరికి ఇవ్వడం అనేది కాస్త కొత్తగా వుంది అంటున్నాడు. ఇకపోతే రామ్ చరణ్ కి అజయ్ దేవగన్ డబ్బింగ్ చెబుతుండగా.... ధ్రువ లోని మరో పవర్ఫుల్ క్యారెక్టర్ అరవింద్ స్వామికి సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ డబ్బింగ్ చెప్పడం ఇక్కడ విశేషం.

Similar News