చరణ్ కోసం అంత ఖర్చా..!!

Update: 2017-07-19 16:33 GMT

రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'రంగస్థలం 1985 ' చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పటివరకు పల్లెటూరి వాతావరణం కోసం రాజమండ్రి, కొల్లేరు, పాలకొల్లు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేసిన సుక్కు టీమ్ ఇప్పుడు హైదరాబాద్ లోని విలేజ్ కోసం ఇక్కడికి వచ్చేసింది. అదేమిటి రంగస్థలం సినిమా అంతా పల్లెటూరి బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతోందని అన్నారు ఇప్పుడేమో హైదరాబాద్ లో విలేజ్ అనుకుంటున్నారు అని ఆలోచిస్తున్నారా...?

మరి రంగస్థలం సినిమా మొత్తం పల్లెటూరి వాతావరణం చుట్టూ కథ అల్లుకుని ఉండడంతో మంచి పల్లెటూరి కోసం చిత్ర యూనిట్ సర్చ్ చెయ్యగా.... చిత్ర యూనిట్ కి ఏ పల్లెటూరు పెద్దగా నచ్చక... ఆ పక్కా పల్లెటూరి నేపధ్యం ఉన్న విలేజ్ కోసం ఇప్పుడు ఏకంగా 5 కోట్లు వెచ్చించి హైదరాబాద్ నగర శివార్లలో పల్లెటూరి సెట్ వేస్తున్నారట. ఇక ఆ సెట్ ని చూస్తుంటే అబ్బా పల్లెటూరు అంటే ఇలానే ఉంటుందా అనిపిస్తుంది. అందుకే ఈ సెట్ కోసం భారీగా ఖర్చు పెట్టేస్తున్నారట నిర్మాతలు కూడా.

ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ పల్లెటూరి యువకుడిగా చెవిటివాని పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక రామ్ చరణ్ కి జోడిగా సమంత హీరోయిన్ గా నటిస్తుండగా... ఆది పినిశెట్టి, అనసూయలు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

Similar News