చరణ్ కి విలన్ గా సీనియర్ హీరో

Update: 2017-11-10 22:30 GMT

ప్రస్తుతం రామ్ చరణ్... సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం 1985' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన విలెజ్ సెట్ లో జరుగుతుంది. అయితే ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తన నెక్స్ట్ మూవీ బోయపాటి తో సైన్ చేసిన సంగతి తెలిసిందే. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌ టైనర్‌ గా ఈ మూవీని తెరకేక్కిస్తున్నాడు బోయపాటి.

ఇది ఇలా ఉండగా.. రామ్ చరణ్ - బోయపాటి సినిమాలో విలన్ గా రాజశేఖర్ ని అనుకుంటున్నారట చిత్ర యూనిట్. రాజశేఖర్ చాలా ఏళ్ళు గ్యాప్ తీసుకుని గరుడ వేగా సక్సెస్ అందుకుని మళ్ళి అందరి దృష్టి లో పడ్డాడు. అలాగే తాను స్టార్ హీరోల సినిమాల్లో విలన్ గా అయినా నటించడానికి సిద్దమని రాజశేఖర్ ఎప్పుడో ప్రకటించాడు కూడా.

అయితే చరణ్ - బోయపాటి సినిమాలో రాజశేఖర్ ని విలన్ గా తీసుకొమ్మని మెగా స్టార్ చిరంజీవి సజెస్ట్ చేసాడనే టాక్ వినబడుతుంది. 'గరుడ వేగా'చూసిన చిరు.. రాజశేఖర్ నటన నచ్చడంతో తనని చరణ్ సినిమాలో విలన్ పాత్రకి సజెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇదే కనుక నిజం అయితే రాజశేఖర్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి. అయితే ఈ విషయంపై పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Similar News