రాజమౌళి దర్శకత్వంలో.. రామ్ చరణ్ - తారక్ మల్టీస్టారర్ మూవీ. ఈ టైటిల్ వినడానికే సూపర్ అనిపిస్తుంది. మరి అధికారికంగా ఎనౌన్స్ చెయ్యకపోయినా ఈ సినిమా పక్కా. ఇప్పటికే రాజమౌళి ఈ మల్టీస్టారర్ స్క్రిప్ట్ పనులను మొదలు పెట్టినట్లుగా చాలా రోజులనుండి వార్తలొస్తున్నాయి. మెగా - నందమూరి అభిమానుల ఆనందానికి అవధుల్లేని ఈ మల్టి స్టారర్ ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ నుండి పట్టాలెక్కే ఛాన్స్ ఉందనే ఊహాగానాల నడుమ.. ఇప్పుడు ఈ మల్టీస్టారర్ పై మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినబడుతుంది.
అదేమిటంటే ఈ సినిమాలో తారక్, చరణ్ లు పోలీస్ లుగా కనబడతారని ఒకసారి, కాదు మల్ల యోధులుగా కనబడతారని ఒకసారి ప్రచారం జరుగుతున్నా వేళ ఈ సినిమాలో చరణ్ కి హీరోయిన్ గా తొలిప్రేమతో అదిరిపోయే హిట్ అందుకున్న రాశి ఖన్నా ని తీసుకున్నారనే టాక్ బయటికి వచ్చింది. తొలిప్రేమలో రాశి ఖన్నా లుక్స్ తోపాటు.. నటనకు మంత్ర ముగ్దుడైన రాజమౌళి... చరణ్ కి జోడిగా ఫిక్స్ చేసాడని అంటున్నారు. మరి రాశి ఖన్నా ఇదివరకే అంటే రంగస్థలం లోనే రామ్ చరణ్ పక్కన నటించాల్సి ఉంది. కానీ అప్పట్లో రాశి బాగా లావుగా ఉండడంతో చిట్టి బాబు పక్కన రామలక్ష్మి పాత్రని చేజార్చుకుంది. ఆ పాత్రని టాప్ హీరోయిన్ సమంత తన్నుకుపోయింది.
కానీ ఇప్పుడు రాజమౌళి సినిమాలో రామ్ చరణ్ పక్కన రాశి ఖన్నా ఫైనల్ అంటున్నారు. మరి ఒక హీరోకి హీరోయిన్ సెట్ అయ్యింది. మరి రాజమౌళి మరో హీరో ఎన్టీఆర్ కి ఎలాంటి హీరోయిన్ ని సెట్ చేస్తాడో అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చూద్దాం రాజమౌళి ఎన్టీఆర్ కోసం ఎలాంటి అందాల రాశిని పట్టుకొస్తాడో.